Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం మాత్రం ప్రతి ఒక్కరు కీలకపాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. ఇక దర్శకుల విషయానికి వస్తే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…
దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అందువల్లే రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఆయన మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలని చూస్తున్నాడు. అలాగే తన అభిమాన దర్శకుడు అయిన ‘జేమ్స్ కామెరూన్’ పక్కన తన పేరును నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇక రీసెంట్ గా ఒడిశాలో ఒక షెడ్యూల్ ని ముగించుకొని వచ్చిన రాజమౌళి వీలైనంత తొందరలోనే మరొక షెడ్యూల్ కి ప్లాన్ చేసుకుంటున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ ఎత్తున సెట్టు వేసి మరి ఈ సినిమాని చిత్రీకరించాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నారట. ఇప్పటికే సెట్టు పనులు మొత్తం పూర్తయిపోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇక్కడ దాదాపు 15 రోజులపాటు షూటింగ్ చేయాలని రాజమౌళి చూస్తున్నాడు.
Also Read : అడవుల్లో మహేష్ బాబుతో గుర్రపు స్వారీ చేయిస్తున్న రాజమౌళి…మరో వీడియో లీక్ అయిందా..?
ఇక ఇప్పటికే సినిమా రావడం పట్ల లేటవుతుంది కాబట్టి తొందరగా సినిమాని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తను అహర్నిశలు ప్రయతమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల పైన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నారట.
మరి ఈ సన్నివేశాలను కనుక చిత్రీకరించినట్లయితే సినిమాలో ఉన్న మేజర్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని ఇక మిగతా యాక్షన్ ఎపిసోడ్స్ పైన తను దృష్టి సారించాల్సిన అవసమైతే ఉంటుందని రాజమౌళి చెబుతున్నాడు. మరి మొత్తానికైతే మహేష్ బాబు సినిమా కోసం ఆయన పడుతున్న కష్టం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది.
ఎందుకంటే మహేష్ బాబు సినిమాతో ఆయాన మహేష్ బాబుకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని సైతం ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయడానికి విపరీతంగా కష్టపడుతున్నాడనే ధోరణిలో ప్రతి ఒక్కరు రాజమౌళిని మెచ్చుకుంటూనే తన కష్టం పట్ల ప్రతి ఒక్క తెలుగు అభిమాని కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
Also Read : అడ్వెంచర్ మాత్రమే కాదు..సైన్స్ ఫిక్షన్ కూడా..రాజమౌళి, మహేష్ సినిమా గురించి సంచలన అప్డేట్!