Game Changer
Game Changer : ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ (Global Star) గా అవతరించిన రామ్ చరణ్ (Ram Charan) చేసిన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి. ఇక ఈ సంవత్సరం వచ్చిన గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ సాధించకపోవడంతో బాలీవుడ్ లో ఉన్న అతని అభిమానులు కొంత వరకు నిరాశ చెందారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అభిమానులు సైతం భారీగా డిసప్పాయింట్ అవ్వడం మనం చూశాం…
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి డిజాస్టర్ ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా ఒకే ఒక్కడు లాగా చాలా డిసెంట్ గా ఉండి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ బాట పట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం 500 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తే కేవలం 250 కోట్లను మాత్రమే కలెక్ట్ చేయడంతో 250 కోట్ల నష్టాన్ని దిల్ రాజు భరించాల్సి వచ్చింది. మరి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అనే ధోరణిలో ఇప్పుడు కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి శంకర్ ఇంతకు ముందులా తన మేకింగ్ లో దమ్మునైతే చూపించలేకపోతున్నాడు. కథలు బాగా లేకపోవడం వల్ల ఆయన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ వచ్చినప్పటికి ఈ కథని బాగా చేసి వుంటే అది ఇంకా బాగా వచ్చుండేది. మరి ఆ కథని బాగా రాసుకొని డైరెక్షన్ చేసి ఉంటే సినిమా సూపర్ సక్సెస్ అయ్యేది. అలా కాకుండా శంకర్ తనకు నచ్చినట్టుగా సినిమాలను చేస్తూ భారీ ఖర్చును పెట్టిస్తూ ఉండడం వల్లే తన సినిమాలకి రావాల్సినంత బజ్ అయితే రావడం లేదని ప్రతి ఒక్క అభిమాని అనుకుంటున్నాడు. శంకర్ అంటే ఒకప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన దర్శకుడు…
Also Read : ‘గేమ్ చేంజర్’ హిందీ ఓటీటీ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్..5 రోజుల్లో వచ్చిన వ్యూస్ ఎంతంటే!
ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటుందని ఒక దృఢ సంకల్పంతో ప్రేక్షకులందరు ఉండేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. గత పది సంవత్సరాల నుంచి శంకర్ కి ఒక్కటి కూడా సరైన సక్సెస్ అయితే లేదు. ఆయన చేసిన సినిమాలన్నీ చేసినట్టుగా డిజాస్టర్ బాటపడుతున్నాయి.
ఇక రామ్ చరణ్ సాహసం చేసి మరి అతనితో సినిమా చేసినప్పటికి ఆ సినిమాని కూడా సక్సెస్ తీరాలకు చేర్చడంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక ఏమాత్రం క్యాలిక్యులేషన్స్ లేకుండా సినిమా ఫుటేజ్ 5 గంటలు వచ్చింది. దాంట్లో నుంచి రెండున్నర గంటల సినిమాని కట్ చేశారు అంటూ శంకర్ కామెంట్స్ చేశాడు.
ఇదంత చూస్తుంటే శంకర్ కి సినిమా మీద అసలు ఇంట్రెస్ట్ లేదన్న విషయంమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. రెండున్నర గంటలు రావాల్సిన సినిమాని ఐదు గంటలు తీసి అంత ఫుటేజీని వేస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి శంకర్ ఎందుకని ఇలా వ్యవహరిస్తున్నాడు. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ కి పూర్తి బాధ్యత తనే వహించాల్సి ఉంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : ‘గేమ్ చేంజర్’ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే అంటూ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్!