Prashanth Varma , Balayya
Prashanth Varma and Balayya : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. మరి నట వారసులు సైతం పాన్ ఇండియా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు కొడుకు ఆయన మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు…
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేయడమే కాకుండా ఇప్పటివరకు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యంకానీ రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన తన నట వారసుడు ఆయన మోక్షజ్ఞ (Mokshagna) ని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే అన్ని పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నప్పటికి దర్శకుడు ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి అప్డేట్ రాకపోవడంతో బాలయ్య బాబు కొంతవరకు సీరియస్ గా ఉన్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ మొదటి సినిమాను ప్రశాంత్ వర్మతో చేయించాలని బాలయ్య బాబు పట్టుబట్టి మరీ అతనితో సినిమా చేయించడానికి ప్రణాళికలు రూపొందుస్తుంటే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) మాత్రం బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమాని కొంతవరకు లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఒక నట వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే మాత్రం దానికి చాలా గట్స్ ఉండాలి. ఏమాత్రం చిన్న తేడా జరిగిన కూడా ఆ ఫ్యామిలీ అభిమానులందరూ దర్శకుడిని తిడుతూ ఉంటారు.
Also Read : మోక్షజ్ఞకు హ్యాండ్ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీకి సిద్ధం!
కాబట్టి ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఇక హనుమాన్ (Hanuman) సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా పాన్ ఇండియాలో పెను రికార్డులను కూడా క్రియేట్ చేశారనే చెప్పాలి. మరి ఇప్పుడు తనకు భారీ మార్కెట్ అయితే ఉంది. మరి ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి బాలయ్య బాబు ప్రశాంత్ వర్మ చేతిలో తన కొడుకుని పెట్టినట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎలాంటి జానర్ లో వస్తుంది ఎలాంటి సినిమాతో బాలయ్య బాబు కొడుకు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలో వారసులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు.
కానీ బాలయ్య బాబు కొడుకు మాత్రం ఇంకా ఇండస్ట్రీకి పరిచయం అవ్వలేదు.రోజురోజుకీ అతన్ని ఇండస్ట్రీకి తీసుకురావాలి అనే విషయంలో బాలయ్య చాలా వరకు నెగ్లెట్ అయితే చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంవత్సరం కనక మోక్షజ్ఞ ఎంట్రీ ఉండకపోతే మాత్రం నందమూరి అభిమానులు తీవ్రమైన నిరాశకు గురిచెందే అవకాశాలైతే ఉన్నాయి…
Also Read : ప్రశాంత్ వర్మ ను ముంచిన ఓవర్ కాన్ఫిడెంట్…ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే ఆయన బాలయ్య చేతిలో తిట్లు తిన్నాడా..?