Rajamouli Mahabhratam: దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ గా నిలిచాయి. ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన అదే క్లారిటీ ని మైంటైన్ చేస్తూ ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫెయిల్యూర్ అనేది తన దరిదాపుల్లో కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అనుక్షణం సినిమా కోసం పనితపించే వాళ్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఎందుకంటే ఆయనకు సినిమా తప్ప వేరే ప్రపంచంలో లేదు. రాజమౌళి మార్క్ తో వచ్చిన సినిమా ఏది ఏ ఒక్క ప్రేక్షకుడిని నిరాశపరచకూడదు అనే ఒక పాయింట్ తో ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే అతని సినిమాలో ప్రతిదీ హైలైట్ అవుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్న రాజమౌళి ఈ సినిమా తర్వాత ‘మహాభారతం’ సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీసెర్చ్ అంతా చేశాడు. దాన్ని ఎలా తెరకెక్కించాలి.
బడ్జెట్ ఎంతవుతుంది అనే విషయాలను సైతం రాజమౌళి అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలామంది నటులు అవసరమవుతారు. కాబట్టి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు ఈ సినిమాలో నటించే అవకాశమైతే ఉంది… ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లందరు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారట.
ముఖ్యంగా రామ్ చరణ్ ఏ పాత్ర చేస్తున్నాడు అనే విషయం మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ అర్జునుడి పాత్రను పోషించబోతున్నాడని రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి క్లారిటి అయితే వచ్చింది…
మహాభారతంలో అర్జునుడి పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. యుద్ధం మొత్తం అతని మీదనే నడుస్తోంది. కాబట్టి రామ్ చరణ్ అయితే ఆ పాత్రకి సరిగ్గా సరిపోతాడని అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా నటుడు ఎవరెవరు ఏ పాత్రను పోషించబోతున్నారనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…