సోషల్ మీడియా.. అనేది మనిషి జీవితంలో ఊహించని మార్పులకు కారణమవుతోంది. సోషల్ మీడియా ఆధారంగా మనిషి జీవితం అనేక రకాల మలుపులకు గురవుతోంది. సాధారణ ప్రజల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాను నేటి కాలంలో ఫాలో అవుతున్నారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా చుట్టూ పరిభ్రమిస్తున్నారు.
సోషల్ మీడియాలో కార్పొరేట్ కంపెనీల హవా కొనసాగుతూ ఉంటుంది. సోషల్ మీడియా కేంద్రంగా లక్షల కోట్ల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. మొదట్లో మెటా, ఆల్ఫాబెట్ కంపెనీలు మాత్రమే ఇందులో ఉండేవి. ఎప్పుడైతే ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సంస్థను ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తి కొనుగోలు చేశాడో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది.
డబ్బు కోసం నానా గడ్డి తినే మస్క్.. ట్విట్టర్ విషయంలో కూడా అలానే వ్యవహరిస్తున్నాడు. మిగతా సంస్థలకు పోటీగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ట్విట్టర్ లో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ గ్రోక్ (Grok) ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. అయితే ఇటీవల గ్రోక్ ద్వారా అశ్లీల కంటెంట్ వ్యాప్తిలోకి వస్తోందని ఆరోపణలు వినిపించాయి. ఏకంగా సుప్రీంకోర్టు, భారత ప్రభుత్వం కూడా గ్రోక్ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే గ్రోక్ ను ఉపయోగించి అసభ్య, అశ్లీల, చట్ట విరుద్ధమైన కంటెంట్ సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మస్క్ స్పందించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతేకాదు ఈ చాట్ బాట్ ను ఉపయోగించి సృష్టిస్తున్న కంటెంట్ మొత్తాన్ని తొలగించాలని ఇండియన్ ఎలక్ట్రానిక్ ఐటీ మినిస్ట్రీ ఎక్స్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల మహిళలు వన్డే వరల్డ్ కప్ (ICC women’s ODI World Cup) లో సత్తా చూపించిన స్టార్ బ్యాటర్ ప్రతీక రావల్ (pratika Rawal) ఫోటోలను కొంతమంది ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఆమె మండిపడ్డారు గ్రోక్ మీద సీరియస్ అయ్యారు. “అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. నా ఫోటోలను ఎడిట్ చేయడానికి గ్రోక్ కు ఎటువంటి అధికారం లేదు. ఒకవేళ నా ఫోటోలను ఎడిట్ చేయాలని ఎవరైనా అడిగితే మొహమాటం లేకుండా తిరస్కరించాలని” ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇటీవల పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.