Producer Naga Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న వారిలో నాగవంశీ ఒకరు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద ఆయన సినిమాలను చేస్తుంటాడు. ఒక సినిమాని సక్సెస్ చేయడానికి నాగ వంశీ విపరీతమైన ప్రమోషన్స్ చేస్తాడు… కొన్ని సందర్భాల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు సైతం వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని సందర్భాల్లో ఆయన ట్రోల్ కి గురవుతుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ట్రోల్ చేసిన ఆయన ఇబ్బంది పడడు. ఎందుకంటే అది సినిమాకి ప్రమోషన్స్ కి హెల్ప్ అవుతుంది… దానివల్లే అతను ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరాలను చెప్పడు. కొన్ని సందర్భాల్లో ట్రోలర్స్ అతని మాటలను ట్రోల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కావాలనే కొన్ని మాటలైతే మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది సినిమా మేధావులు సైతం చెబుతూ ఉంటారు. 2025 వ సంవత్సరంలో ఆయన చేసిన సినిమాలు తనను చాలావరకు ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి.
దానివల్ల ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు సైతం అతన్ని చాలా వరకు దెబ్బ కొట్టాయి…ఇక రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కింగ్డమ్ సినిమా విషయం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆ మూవీ సూపర్ సక్సెస్ అవుతుంది అనుకున్నాం. కానీ ఫ్లాప్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు.
బహుశా సెకండాఫ్ లో మేము చేసిన కొన్ని తప్పిదాల వల్లే ఆ సినిమా ఆడలేదేమో అంటూ ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడాడు. సినిమా హిట్ అయితేనే దర్శకులతో ర్యాపో మెయింటెన్ చేస్తారు. లేకపోతే వారిని పక్కన పెట్టేస్తారు అనేది అవాస్తవమని మంచి ర్యాపో కుదిరితే సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఆ దర్శకులను మేము వదులుకునే ప్రసక్తి ఉండదని చెప్పారు. అలాగే మనకు సెట్ అవ్వని దర్శకుడు సూపర్ సక్సెస్ అందించిన వాళ్లతో మనం మరొక సినిమా చేసే అవకాశం ఉండదని ఆయన చాలా స్ట్రైట్ గా సమాధానమైతే చెప్పాడు…
కేవలం హీరోల కోసమే యావరేజ్, బిలో యావరేజ్ ఉన్న సినిమాలను సక్సెస్ ఫుల్ సినిమాలని మేము చెబుతాం…ఆ సినిమాలను అలా కవర్ చేస్తూ ఉంటామని నాగవంశీ చెప్పాడు. మొత్తానికైతే హీరోల కోసమే సినిమా సక్సెస్ అంటూ ప్రమోట్ అలా చేస్తాం అని ఆయన ఓపెన్ గా చెప్పడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…