Aditya Dhar Next Movie: ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ దర్శకుడికి ఇండస్ట్రీలో భారీ క్రేజ్ దక్కుతుంది. అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు పోటీ పడుతుంటారు. స్టార్ డమ్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తే కెరియర్ కి ప్రమాదం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా సరే సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి దర్శకుడు తీవ్రమైన ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే వాళ్ళు ఏదైతే కథ రాసుకున్నారో ఆ కథకి సెటయ్యే హీరోని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాళ్ళతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తే మంచిది. ఇక ‘దురంధర్ 2’ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్న దర్శకుడు ఆదిత్య ధర్… ప్రస్తుతం అతనికి ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం సెలెక్టెడ్ గా వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన మహాభారతంలోని అర్జునుడి పాత్రను బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ అయితే రాసుకున్నాడట. దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
దాదాపు ఈ సినిమా కోసం 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాని ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో కూడా తన ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగు స్టార్ హీరోలైన ప్రభాస్ తో గాని లేదంటే రామ్ చరణ్ తో గాని చేయడానికి తను సన్నాహాలు చేసుకుంటున్నాడట.
ప్రస్తుతం ప్రభాస్ డేట్స్ దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వరుసగా నాలుగు సినిమాలకు కమిటై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ డేట్స్ దొరకడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఈ సినిమాను రామ్ చరణ్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే రామ్ చరణ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
రీసెంట్ గా వీళ్ళిద్దరి మధ్య కథా చర్చలు కూడా నడిచాయనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా మీద రామ్ చరణ్ కానీ ఇంకా ఎవరు స్పందించలేదు మరి తొందరలోనే దీనికి ఒక క్లారిటీ ఇవ్వడానికి అటు రామ్ చరణ్, ఇటు ఆదిత్య ధర్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…
