Rajamouli Wife
SS Rajamouli : దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)… ఈయన చేసిన 12 సినిమాలకు 12 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. మరి ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు (Mahesh Babu) ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు. కానీ ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన స్టార్ డమ్ అనేది తారస్థాయికి చేరుకుంటుందని తన అభిమానులు సైతం ఆశిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రఖ్యాతిగాంచిన జేమ్స్ కామెరూన్ (James Cameron) లాంటి దర్శకుడు పక్కన తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు.
Also Read : ఏడాది నుండే మహేష్ ,రాజమౌళి సినిమా షూటింగ్ జరుగుతుందా..ఇదేమి ట్విస్ట్
రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళి కూడా రాజమౌళి చేసే సినిమాలకు స్టైలిస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే రాజమౌళికి అన్నీ విషయాల్లో చాలావరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు రాజమౌళి చేసిన సినిమాల్లో తనకి బాగా నచ్చిన సినిమాలు ఏంటి అనే ఒక ప్రశ్న ఆమె ముందు ఉంచగా, దానికి సమాధానంగా ఆమె విక్రమార్కుడు, మగధీర సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.
ఆ సినిమాల్లో రాజమౌళి పెట్టిన ఎఫర్ట్ పూర్తిగా కనిపిస్తుంది అంటూ తను చెప్పడం విశేషం. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను సాధించడమే కాకుండా రాజమౌళి ని టాప్ పొజిషన్ కి తీసుకెళ్ళాయి. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు.
దీనివల్ల యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకునే అవకాశాలైతే ఉన్నాయి. తను గతంలో చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన సినిమాను విస్తరింపజేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ఈ ప్రయాణం సాగించడం కష్టమే..మహేష్,రాజమౌళి మూవీపై కీరవాణి కామెంట్స్