https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ కోసం రిస్కీ స్టంట్ చేసిన రాజమౌళి

ఎంత మంచి కథైనా అద్భుతమైన దృశ్య రూపం ఇచ్చినప్పుడే అది మంచి సినిమాగా మారుతుంది. స్క్రిప్ట్ ని తెరపైకి తెచ్చే దర్శకుడు చేతిలోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. గొప్ప స్టోరీ టెల్లర్ గా పేరున్న రాజమౌళి అందుకే పరాజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. తాను తెరకెక్కించే మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడు రాజమౌళి. అలాగే ప్రతి సన్నివేశాన్ని ఆయనే స్వయంగా నటించి చూపిస్తారు. నటుల పనిని తేలిక చేసి […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 12:34 PM IST
    Follow us on


    ఎంత మంచి కథైనా అద్భుతమైన దృశ్య రూపం ఇచ్చినప్పుడే అది మంచి సినిమాగా మారుతుంది. స్క్రిప్ట్ ని తెరపైకి తెచ్చే దర్శకుడు చేతిలోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. గొప్ప స్టోరీ టెల్లర్ గా పేరున్న రాజమౌళి అందుకే పరాజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. తాను తెరకెక్కించే మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడు రాజమౌళి. అలాగే ప్రతి సన్నివేశాన్ని ఆయనే స్వయంగా నటించి చూపిస్తారు. నటుల పనిని తేలిక చేసి తనకు కావలసిన అవుట్ ఫుట్ రాబట్టుకుంటారు. సన్నివేశం చిత్రీకరణలో ఏమాత్రం అసంతృప్తి కలిగినా… వదిలిపెట్టరు. తాను అనుకున్నట్లు షాట్ కుదిరేవరకు టేక్ లపై టేక్ లు చేయిస్తూనే ఉంటాడు.

    Also Read: అనూహ్యంగా ఓటింగ్ లో అభిజిత్ రెండో స్థానానికి!

    అలాంటిది ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు టాప్ స్టార్స్ హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. ఓ ఫైట్ సీన్ కోసం రాజమౌళి స్వయంగా ఓ రిస్కీ స్టంట్ చేసి చూపించారట. ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వెల్ కి ముందే వచ్చే పోరాట సన్నివేశాన్ని రాజమౌళి భారీగా చిత్రీకరిస్తున్నారట. పదినిమిషాలు పైగా సాగే ఈ పోరాట సన్నివేశం విజువల్ వండర్ గా తీర్చిదిద్దంతో పాటు, మెగా అభిమానులతో పాటు, నందమూరి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేశారని సమాచారం.

    Also Read: భారీగా దిల్ రాజు 50వ జన్మదిన వేడుకలు !

    అయితే ఈ పోరాట సన్నివేశం కోసం ఎన్టీఆర్, చరణ్ పైనుండి తాళ్ల సహాయంతో క్రిందికి దూకాల్సి వుంటుందట. ఎన్నిసార్లు చేసినా ఆ సన్నివేశం రాజమౌళి అనుకున్ననట్లు రావడం లేదట. చాలా సార్లు చేసిన ఇద్దరు హీరోలు చాలులే జక్కన్నా అన్నా… ఆయన పట్టువీడలేదట. చివరకు తానే రోప్స్ సహాయంతో ఆ జంప్ చేసి చూపించారట. ఆ తరువాత ఆ షాట్ లో పాల్గొన్న ఎన్టీఆర్, చరణ్ పర్ఫెక్ట్ గా చేసిన ఆయనను సంతృప్తి పరిచారట. ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ ల చేత చెమటలు చిందిస్తున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల అనుకున్న సమయానికంటే ఏడాది ఆలస్యం కాగా 2021లో ఎలాగైనా విడుదల చేయాలని రాజమౌళి పనిచేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్