Rajamouli Death Stranding 2: భారీ బడ్జెట్ తో సినిమాని తీయడమే కాదు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళే కెపాసిటీ కూడా ఉండాలి. మన సినిమా ఎంత బాగున్నా కూడా ప్రేక్షకులకు సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మన ప్రమోషన్స్ అయితే ఉండాలి. సినిమాలో ఉన్న కంటెంట్ ను మనం టీజర్, ట్రైలర్లు ద్వారా చూపిస్తే అంతకు మించిన క్యూరియాసిటి రేకెత్తించేలా ప్రమోషన్స్ ను చేసినప్పుడే సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అలాంటి సందర్భంలో ప్రేక్షకులందరు ఆ సినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ కి మూవీ నచ్చినట్లైతే రిపీటెడ్ గా చూడ్డానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన రాజమౌళి (Rajamouli) ఆ సినిమా సమయంలోనే విపరీతమైన ప్రమోషన్స్ చేసి సినిమాకు కావాల్సినంత బజ్ అయితే తీసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో మరోసారి తను నమ్ముకున్న స్ట్రాటజీతో విపరీతమైన ప్రమోషన్స్ చేసి మొత్తానికైతే సినిమా మీద ప్రతి ఒక్కరికి హైట్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాని చూడకపోతే వేస్ట్ అనే రేంజ్ లో వాళ్లలో ఆ మూవీ తాలూకు ఇంపాక్ట్ ను ఎక్కించాడు… ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతూనే సినిమా ప్రమోషన్స్ ను ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజమౌళి ఎంత బిజీగా ఉన్నప్పటికి ఇతరుల ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ సినిమా మీద బజ్ ను పెంచుతూ తను ఎప్పుడు జనాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమా మూడో షెడ్యూల్లో పాల్గొంటున్న పాన్ ఇండియా స్టార్స్ వీళ్ళే…
దీనివల్ల అనుక్షణం ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటూ వీడియోలో కనిపిస్తాడు, అలాగే ఆయన గురించి వార్తలు రావడం వల్ల జనాల్లో ఎప్పుడూ ఆ బజ్ అనేది ఉంటుంది దాన్ని మైంటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా తన ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా ఆయన ఇంటర్నేషనల్ డయాస్ మీద సందడి చేశాడు.
జపాన్ లోని ఒక వీడియో గేమ్ లో అతను కనిపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని అలరించాడు. హిడియో లేటెస్ట్ గేమ్ షో డెత్ స్టాండింగ్ 2 లో ఆయన కనిపించారు… ఇక ఇవన్నీ చేసేది మహేష్ బాబు సినిమా కోసమే అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఆయనకున్న క్రేజ్ ను వాడుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు అందులో తప్పేముంది అంటున్నారు.
నిజానికి రాజమౌళి చాలా టైం సెన్స్ ని ఫాలో అవుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఒక రకంగా కెన్యా షెడ్యూల్ కోసం తను బిజీగా ఉన్నప్పటికి జపాన్ నుంచి పిలుపు రావడంతో తను షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సమయం వచ్చిందని టైం ని మేనేజ్ చేస్తూ జపాన్ వెళ్లి ఈవెంట్లో పాల్గొన్నారు…