Black sand issue in Vizag beach: విశాఖ( Visakhapatnam) తీర ప్రాంతంలో వింత పరిస్థితి కనిపిస్తోంది. తీరంలో ఉన్న ఇసుక ఒక్కసారిగా రంగు మారుతోంది. నల్లగా మారుతుండడంతో పర్యాటకులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున వ్యర్ధాలు, కాలుష్యం కారణంగా ఇలా రంగు మారిందన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు వాతావరణం లో మార్పులు వల్ల కూడా ఇసుక నల్లగా మారింది అంటున్నారు. గతంలో కూడా విశాఖ తీరంలో ఇసుక రంగు మారిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్కే బీచ్ లో కోస్టల్ బ్యాటరీ నుంచి నో వాటర్ హోటల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వరకు ఇసుక తిన్నెలు నల్లగా మారిపోయాయి. దీంతో విశాఖకు ఏమయింది అంటూ ఎక్కువమంది చర్చించుకుంటున్నారు. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. విశాఖను రాజధానిగా ప్రకటించి.. శాపాన్ని మూటగట్టుకునేలా చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Also Read: Pawan Kalyan RK Beach : విశాఖ సాగరతీరంలో చిల్ అయిన పవన్ కళ్యాణ్
కాలుష్యమే కారణం..
అయితే విశాఖ తీరంలో( Visakha beach ) ఇసుక రంగు మారడానికి వ్యర్ధాలు నీటిలో కలవడమే ప్రధాన కారణం అన్న టాక్ వినిపిస్తోంది. కానీ నిపుణులు మాత్రం అది కాదంటున్నారు. ఇసుకలో ఉండే లైట్, హెవీ మినరల్స్ విడిపోవడం వల్లే తీరం నల్లగా మారిందని చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల అలల ఉధృతి పెరిగినప్పుడు తీరంలో ఉండే లైట్ మినరల్స్ నీటితో పాటు సముద్రం లోపల కు వెళ్లిపోతాయి. హెవీ మినరల్స్ తీరంలోనే ఉండిపోతాయి. బరువుగా ఉండే ఈ మినరల్స్ లో ఎక్కువగా ఇలమనైట్, రుటైల్, జింకాన్, గార్నెట్, సిలిమినైట్ వంటివి ఉంటాయి. బీచ్ నల్లగా మారడానికి ప్రధానంగా ఇలమనైట్, రుటైల్ వంటి హెవీ మినరల్స్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు నల్లగా ఉండడం వల్లే తీరమంతా ఆ రంగులోకి మారుతుంది అంటున్నారు.
Also Read: JD Lakshminarayana- KCR: కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడాడా?: సిబిఐ మాజీ జేడీ పొరబడ్డాడు
అలల తాకిడి ఎక్కువ ఉన్నచోట..
ప్రస్తుతం తీరంలో అలల తాకిడి ఎక్కడ అధికంగా ఉంటుందో అక్కడే ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రెండు రోజులుగా వాతావరణం లో మార్పులు వచ్చాయి. దీంతో అలల ఉధృతి కూడా పెరిగింది. ఈ కారణంగానే తీరంలో హెవీ మినరల్స్, లైట్ మినరల్స్ విడిపోయి ఇసుక తిన్నెలు నల్లగా మారుతున్నాయని అనుమానాలు ఉన్నాయి.. అయితే బీచ్ లో ఇసుక రంగు నల్లగా మారడంతో పర్యాటకులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ ప్రాంతం ఇలా కావడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మరోవైపు రాజధానిగా ఎంపిక చేసిన నగరం ఇలా మారిందేంటి అని సోషల్ మీడియాలో సైతం ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇదో వైరల్ అంశంగా కూడా మారిపోయింది
ఒకప్పుడు రాష్ట్ర రాజధాని అని గర్వంగా చెప్పుకు బతికేటోళ్లు
ఈరోజు ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ అంత యోగా మ్యాట్లు దొబ్బేసుకుపోయినోళ్లు అని ట్రోల్ అవుతున్నారు.
రాజధాని పోయే, పరువు పోయే
ఇదంతా సరిపోనట్టు రాష్ట్రానికి తగిలిన శాపం వల్ల ఇలా తీర ప్రాంతం అంతా ఇలా నల్లగా మారిపోతుందా ఏంటి… pic.twitter.com/q3HdWmNiIs
— Rakita (@Rakita_IND) June 26, 2025