Rajamouli Dance: దర్శకధీరుడు రాజమౌళి మల్టీ టాలెంటెడ్. ఆయనకు సినిమాకు సంబంధించిన పలు క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంది. ముఖ్యంగా రాజమౌళి ప్రతి సీన్ ని నటించి చూపిస్తారు. ఒక సీన్ లో ఎలా నటించాలో ఆయన ఎక్స్ ప్రెషన్స్ తో సహా నటించి వివరిస్తారు. ఈ కారణంగా రాజమౌళి నటుల నుండి తనకు కావాల్సిన అవుట్ ఫుట్ రాబడతాడు. అదే సమయంలో నటులకు కూడా తమ పని ఈజీ అవుతుంది.
అలాగే రాజమౌళికి నటన మీద కూడా మక్కువ ఉంది. తన సినిమాలతో పాటు ఇతర దర్శకుల చిత్రాల్లో ఆయన చిన్న చిన్న గెస్ట్ రోల్స్ చేశారు. సై, మగధీర, మజ్ను, బాహుబలి, కల్కి చిత్రాల్లో రాజమౌళి నటించిన సంగతి తెలిసిందే. కాగా రాజమౌళిలో మంచి డాన్సర్ కూడా ఉన్నాడు. ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దేవర చిత్రంలోని ఆయుధ పూజ సాంగ్ కి రాజమౌళి డాన్స్ చేశారు. రాజమౌళి అన్నయ్య కీరవాణి చిన్న కొడుకు సింహ కోడూరి వివాహం. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
కుటుంబ సభ్యులు అందరు సరదాగా డాన్స్ చేశారు. దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్ కి రాజమౌళి కుటుంబ సభ్యులు డాన్స్ చేయగా, రాజమౌళి ప్రత్యేకంగా నిలిచాడు. సదరు సాంగ్ కి రాజమౌళి మైమరచి డాన్స్ చేశాడు. ఆయన తనలోని ఫైర్ మొత్తం బయటకు తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. కీరవాణికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్దబ్బాయి కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్. చిన్నబ్బాయి సింహ నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
మత్తు వదలరా, మత్తు వదలరా 2, ఉస్తాద్ వంటి చిత్రాల్లో సింహ నటించాడు. సింహ పెళ్లి వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాజమౌళి-మహేష్ బాబు బడ్జెట్ రూ. 1000 కోట్లు అని అంచనా. జనవరి నుండి ఈ మూవీ షూటింగ్ మొదలంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.