https://oktelugu.com/

Allu Arjun: ఆ ఫ్యామిలీని అందుకే కలవలేను, అరెస్ట్ అనంతరం అసలు మేటర్ ఓపెన్ గా చెప్పేసిన అల్లు అర్జున్!

అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, జైలు జీవితం, విడుదల... అన్నీ చకచకగా జరిగిపోయాయి. అల్లు అర్జున్ అరెస్ట్ పై టాలీవుడ్ నిరసన వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ ని నేరుగా కలిసి పలువురు చిత్ర ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. కాగా మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎందుకు కలవడం లేదనే విమర్శల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : December 16, 2024 / 09:23 AM IST

    Allu Arjun(3)

    Follow us on

    Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ టాలీవుడ్ ని కుదిపేసిన ఉదంతం. పుష్ప 2 ఇంకా థియేటర్స్ లో ఉండగానే అల్లు అర్జున్ ఒక మహిళ మృతి కేసులో జైలుపాలయ్యారు. డిసెంబర్ 4 రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత కన్నుమూసింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు సైతం అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఆ బాలుడికి చికిత్స జరుగుతుంది. ఈ కేసులో ఏ 11గా అల్లు అర్జున్ పేరు చేర్చారు. డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

    కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. అల్లు అర్జున్ లీగల్ టీమ్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటీషన్ దాఖలు చేయడమైనది. హైకోర్ట్ అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బెయిల్ లభించినప్పటికీ సమయానికి జైలు అధికారులకు ఆర్డర్ కాపీ అందని కారణంగా ఒక రాత్రి అల్లు అర్జున్ జైలులో ఉన్నాడు.

    తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. 25 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని విధాల ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము. శ్రీతేజ్ వైద్యానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తామని వెల్లడించారు. అయితే అల్లు అర్జున్ నేరుగా ఆ కుటుంబాన్ని కలవలేదు. పరామర్శించలేదు. దీనిపై ఒకింత విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

    కేసు కోర్టులో ఉంది. న్యాయపరమైన సమస్యల కారణంగా నేను నేరుగా రేవతి కుటుంబాన్ని కలవలేకపోతున్నాను. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అతడి క్షేమం కొరకు నా ప్రార్థనలు కొనసాగుతాయి. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాము… అని కామెంట్ పోస్ట్ చేశారు. కేసు కోర్టులో నడుస్తుండగా… అక్యూస్డ్ గా ఉన్న అల్లు అర్జున్ బాధిత కుటుంబాన్ని కలవడం నేరం అవుతుంది. అందుకే అల్లు అర్జున్ బాధిత కుటుంబాన్ని నేరుగా కలవడానికి వీలులేదని చెప్పారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. రేవతి మరణంతో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా అల్లు అర్జున్ ఈ సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నాడు…