https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నిఖిల్ ని విన్నర్ గా ప్రకటించడంతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విద్వంసం సృష్టించిన గౌతమ్ ఫ్యాన్స్..చెదరగొట్టిన పోలీసులు!

ఎంతో ఉత్కంఠ మధ్య ఈ టైటిల్ విన్నర్ ప్రకటన జరిగింది. అత్యధిక శాతం మంది జనాలు సోషల్ మీడియా లో జరిగిన పోలింగ్స్ ని బట్టి గౌతమ్ కృష్ణ టైటిల్ గెలుస్తాడని అనుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 09:36 AM IST

    Bigg Boss Telugu 8(4)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత సీజన్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన అల్లర్లను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. పల్లవి ప్రశాంత్ అభిమానులు ఆ సీజన్ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కారు పై దాడి చేయడం, ఆ తర్వాత వెనుక వస్తున్న మిగిలిన కంటెస్టెంట్స్ మీద దాడులు చేయడం వంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. దీంతో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ కూడా చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్ లో కూడా పోలీసులు అప్రమత్తంగా లెకపొయ్యుంటే అలాంటి సంఘటనలే జరిగేవి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిఖిల్, రన్నర్ గా గౌతమ్ నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో ఉత్కంఠ మధ్య ఈ టైటిల్ విన్నర్ ప్రకటన జరిగింది. అత్యధిక శాతం మంది జనాలు సోషల్ మీడియా లో జరిగిన పోలింగ్స్ ని బట్టి గౌతమ్ కృష్ణ టైటిల్ గెలుస్తాడని అనుకున్నారు.

    కానీ అది జరగలేదు. దీంతో ఆయన అభిమానులు నిన్న బాగా హర్ట్ అయ్యారు. ఫినాలే ముందు రోజే గౌతమ్ అభిమానులు నిఖిల్ కారుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియా లో పలు వాట్సాప్ చాట్స్ ప్రచారం లోకి వచ్చాయి. ఇది బిగ్ బాస్ టీం వరకు చేరడంతో అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ మూడు అంచుల సెక్యూరిటీ ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గౌతమ్ అభిమానులు తమ అభిమాన కంటెస్టెంట్ గెలవలేదు, రాజకీయం చేసారు, అన్యాయం చేసారు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం తో పోలీసులు వాళ్లపై ఘోరంగా లాఠీ ఛార్జ్ చేసారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం కాస్త ఉద్రిక్తత వాతావరణంలోకి వెళ్ళింది. బిగ్ బాస్ టీం తో పాటు, పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.

    ఒకవేళ గత సీజన్ లో జరిగినట్టు, ఈ సీజన్ లో కూడా జరిగి ఉండుంటే పల్లవి ప్రశాంత్ లాగానే, గౌతమ్ కృష్ణ జైలు కి వెళ్లాల్సి వచ్చేది. అభిమానులు ఆవేశంగా చేసే పనులకు కంటెస్టెంట్స్ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరం గా ఉండాలి. అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా, ఆయన వెళ్లిన ప్రీమియర్ షోకి తొక్కిసిలాట జరిగి, ఒక మహిళ మృతి చెందినందుకు, అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ నే అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే, ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరే ఆలోచించుకోండి. రాబోయే సీజన్స్ లో అయినా అభిమానులు కాస్త ఇవన్నీ చూసుకోవాలి. గేమ్ ని గేమ్ లాగానే చూస్తే ఎలాంటి సమస్య ఉండదు. గౌతమ్, నిఖిల్ హౌస్ లో ఎన్నోసార్లు గొడవపడి ఉండొచ్చు, కానీ బయట వాళ్ళు స్నేహం గానే ఉంటారు. మధ్యలో వాళ్ళ కోసం ఫైట్స్ చేసి అభిమానులు జీవితాలను నాశనం చేసుకునే రేంజ్ కి వెళ్లొద్దు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు చెప్తున్నారు.