Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ఇక ప్రస్తుతం రాజమౌళి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి ఇప్పుడు మహేష్ బాబును పాన్ వరల్డ్ లోకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించగా ప్రస్తుతం ఆయన మహేష్ బాబు సినిమాకు సంబంధించిన కసరత్తులు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను భారీ రేంజ్ లో తీయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా ఆర్టిస్టులు నటిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం రజనీకాంత్ ని సంప్రదించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో క్యారెక్టర్ కనక చేయించినట్లయితే సినిమా మీద భారీ బజ్ కూడా క్రియేట్ అవుతుంది.
రాజమౌళి సినిమాలు అంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉంటాయి. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాలో రజనీకాంత్ నటిస్తే తమిళంలో కూడా భారీ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పాన్ వరల్డ్ సినిమాగా వస్తుంది. ఇక ఈ సినిమాతో రజనీకాంత్ కూడా వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడు. మరి రాజమౌళి అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఇంకా చాలామంది నాటులు కూడా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి వాళ్ళందరూ ఈ సినిమాలో చేయడం వల్ల సినిమాకు వెళ్లిపోవడమే కాకుండా వాళ్లతో కూడా పాన్ ఇండియా మార్కెట్ అనేది క్రియేట్ అవుతుందనే చెప్పాలి. ఈ సినిమాలో రజనీకాంత్ మహేష్ బాబు తండ్రిగా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి రజనీకాంత్ ఒప్పుకున్నాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని కూడా రాజమౌళి తొందర్లోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో రజినీకాంత్, రాజమౌళి, మహేష్ బాబు ముగ్గురు కలిసి ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తారు అనేది…