Vetrimaaran: ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ రామ్ చరణ్, జూనియర్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళ నుంచి సినిమాలు ఎప్పుడు వస్తాయంటూ బాలీవుడ్ అభిమానులు సైతం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రభాస్ మాత్రం వరుసగా పాన్ ఇండియా సబ్జెక్ట్ లతో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకున్న ఆయన ఇప్పుడు ఫౌజీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా సినిమాల పరంపర ని మొదలుపెట్టిన ప్రభాస్ వరుస సినిమాలను చేయడమే కాకుండా భారీ రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు మాత్రం తెలుగు సినిమా దర్శకులతో సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటునే వాళ్ళ ఫేవరెట్ డైరెక్టర్ గా మాత్రం తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులను చెప్పడం అనేది కొంతవరకు మన దర్శకులకు ఇబ్బంది కలిగిస్తుంది. కానీ హీరోలు మాత్రం తమిళ దర్శకులు మాత్రమే వాళ్ల ఫేవరెట్ డైరెక్టర్స్ గా చెప్పుకుంటూ వస్తున్నారు.
రీసెంట్ గా రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు వెట్రి మారన్ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు.అలాగే ఆయన డైరెక్షన్ లో నటించడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అలాగే దేవర సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీయార్ చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ లో తనకు వెట్రి మారన్ అంటే చాలా ఇష్టమని ఆయన డైరెక్షన్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం… నిజానికి వెట్రి మారన్ తీసే సినిమాలు తమిళ్ ప్రేక్షకులను మాత్రమే అలరిస్తాయి. ఆయన స్పాన్ కూడా ఒక ఏరియా వరకే పరిమితం అయి ఉంటుంది. కాబట్టి పాన్ ఇండియా సినిమాలను ఆయన చేయలేడనేది వాస్తవం.
మరి ఇలాంటి క్రమంలో మన హీరోలు ఆ దర్శకుడి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణాలు ఏంటి అనే దూరంలో ఇప్పుడు పలు రకాల ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. ఇక మొత్తానికైతే మన స్టార్ హీరోలు మన దర్శకుల సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందుకున్నప్పటికీ, తమిళ్ సినిమా దర్శకుడు తో సినిమాలు చేయాలని ఉంది అని చెప్పడం ఇప్పుడు ప్రేక్షకులందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇప్పుడు వెట్రి మారన్ వీళ్లతో సినిమాలు చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…