https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అంచనాలు మొత్తం తలక్రిందులు..ఈ వారం మరో అన్యాయమైన ఎలిమినేషన్ జరగబోతుందా?

ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే విష్ణు ప్రియ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నెంబర్ స్థానం లో ఉంది. మార్జిన్ కూడా మామూలు రేంజ్ లో లేదు. ఈమెకి వచ్చే ఓటింగ్ లో కంటెస్టెంట్స్ అందరికి కలిపి సగం కూడా లేదు. విష్ణు ప్రియ ఆ స్థానం లో ఉంటే మణికంఠ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 08:51 AM IST

    Bigg Boss 8 Telugu(51)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రెండవ వారం శేఖర్ బాషా ఎలిమినేషన్ ని ప్రేక్షుకులు అన్యాయంగా ఫీల్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వారం కూడా అలాంటి అన్యాయమైన ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే కనుక జరిగితే ఈ సీజన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ఓటింగ్ శాంపిల్స్ ప్రకారం ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ స్థానం లో ఉన్నారు?, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ముందుగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే విష్ణు ప్రియ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నెంబర్ స్థానం లో ఉంది. మార్జిన్ కూడా మామూలు రేంజ్ లో లేదు. ఈమెకి వచ్చే ఓటింగ్ లో కంటెస్టెంట్స్ అందరికి కలిపి సగం కూడా లేదు. విష్ణు ప్రియ ఆ స్థానం లో ఉంటే మణికంఠ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు.

    ఇక మూడవ స్థానం లో నైనికా, నాల్గవ స్థానం లో కిరాక్ సీత కొనసాగుతున్నారు. కిరాక్ సీత మొదటి వారం నామినేషన్స్ లో డేంజర్ జోన్ కి దగ్గరగా ఉండేది, కానీ ఇప్పుడు ఆమె ఆటతీరు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఈమె టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా 5 వ స్థానం లో ప్రేరణ కొనసాగుతుండగా, 6 వ స్థానం లో యష్మీ కొనసాగుతుంది. వాస్తవానికి యష్మీ ఈ వారం డేంజర్ జోన్ లో ఉండాల్సిన కంటెస్టెంట్. కానీ ఈ వారం ఆమె ఆట తీరు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అందుకే ఆమె గ్రాఫ్ ని పెంచేశారు. ఇదంతా పక్కన పెడితే చివరి రెండు స్థానాల్లో మాత్రం అభయ్, పృథ్వీ రాజ్ కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరు ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు కొంతమంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రేరణ అమ్మమ్మ నిన్న చనిపోయింది.

    ఈ విషయాన్ని ప్రేరణకు నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి చెప్తాడు. కానీ ఎందుకో టెలికాస్ట్ లో చూపించలేదు. రేపైనా చూపిస్తారో లేదో చూడాలి. అయితే ఈ కారణం చేత ప్రేరణ ను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపే అవకాశాలు ఉన్నాయి. శేఖర్ బాషా ని ఎలాంటి పద్దతిలో అయితే ఆయనని బయటికి పంపారో, ప్రేరణ ని కూడా అలా బయటకి పంపే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే మరో అన్యాయమైన ఎలిమినేషన్ అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రేరణ టాప్ 5 కంటెస్టెంట్ అవ్వడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్, ఆమెని ఎలిమినేట్ చేస్తే ఈ షో గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.