https://oktelugu.com/

Rajamouli: ప్రభాస్ కారణంగా రాజమౌళి పరువు తీస్తున్న బాలీవుడ్… ఆ సంచలన వీడియో వెలుగులోకి!

ప్రభాస్-అర్షద్ వార్సి వివాదం కాకరేపుతుంది. అర్షద్ వార్సి కల్కిలో ప్రభాస్ జోకర్ వలె ఉన్నాడంటూ ఎగతాళి చేశాడు. అర్షద్ కామెంట్స్ పై టాలీవుడ్ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వివాదం కారణంగా రాజమౌళి అనూహ్యంగా బుక్ అయ్యాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 21, 2024 / 05:54 PM IST

    Rajamouli(2)

    Follow us on

    Rajamouli: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ప్రభాస్ పై అనుచిత కామెంట్స్ చేశాడు. కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడంటూ నోరుపారేసుకున్నాడు. అర్షద్ వార్సి కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు అర్షద్ వార్సి కి గట్టి కౌంటర్లు ఇచ్చారు. అయితే అనుకోకుండా రాజమౌళి ఈ వివాదంలో చిక్కుకున్నాడు. రాజమోళి ఓల్డ్ వీడియో బాలీవుడ్ జనాలు వైరల్ చేస్తున్నారు. రాజమౌళి చేసింది తప్పు కాదా అంటున్నారు. ఆ వివాదం ఏమిటో చూద్దాం..

    Also Read: సెప్టెంబర్ 2న ‘ఓజీ’ ఫ్యాన్స్ కి పండగే..క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్య

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయి ఊహించని స్థాయికి వెళ్ళింది. బాహుబలి సిరీస్ తో బాలీవుడ్ ని షేక్ చేశాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో, కల్కి 2898 ఏడీ రూపంలో మరో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేశాడు. కల్కి 2898 ఏడీ సినిమా ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రభాస్ ఫేమ్, క్రేజ్ చూసి కొందరు బాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    అందుకే ఇలా సందర్భం దొరికినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో ది కాశ్మిరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకులు ఎవరిని పడితే వారిని రాముడిగా చూడటానికి ఇష్టపడరు అని వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్ చేశాడు. తాజాగా నటుడు అర్షద్ వార్సి ప్రభాస్ పై అనుచిత కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో కల్కి 2898 ఏడీ సినిమాను ఉద్దేశిస్తూ అర్షద్ వార్సి మాట్లాడారు.

    కల్కి మూవీలో ప్రభాస్ ని చూసి చాలా నిరాశ చెందాను. ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు. నేను కల్కి బదులు మ్యాడ్ మ్యాక్స్ సినిమా చూస్తాను అని అర్షద్ వార్సి కామెంట్స్ చేశాడు. కల్కి చిత్రం హాలీవుడ్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ కి కాపీ అనే అర్థం వచ్చే విధంగా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అర్షద్ వార్సి వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నారు.

    అనుకోకుండా ఈ వివాదంలో దర్శకుడు రాజమౌళి బుక్ అయ్యాడు. అర్షద్ వార్సి వ్యాఖ్యలను ఖండిస్తూ టాలీవుడ్ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ ని కించపరిచేలా మాట్లాడే స్థాయి అతనికి లేదంటూ మండిపడుతున్నారు. వీటికి బాలీవుడ్ జనాలు కౌంటర్ ఇస్తూ రాజమౌళి పాత వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు. గతంలో బిల్లా సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.

    ధూమ్ 2 సినిమా చూసి మనకు ఇంత క్వాలిటీ పిక్చర్స్ ఎందుకు రావడం లేదు. హృతిక్ రోషన్ వంటి హీరోలు మనకు లేరా అనిపించేది. బిల్లా మూవీ సాంగ్స్, ట్రైలర్ చూశాక హృతిక్ రోషన్ సరిపోడు అనిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ మూవీ అందించిన మెహర్ రమేష్ కి కృతజ్ఞతలు అని రాజమౌళి అన్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ మరి హృతిక్ రోషన్ కి కించపరిచేలా మాట్లాడిన రాజమౌళి సంగతేంటి. అర్షద్ చేసింది తప్పయితే రాజమౌళి చేసింది కూడా తప్పే అని నార్త్ ఆడియన్స్ నిలదీస్తున్నారు.

    Also Read: ‘ఇంద్ర’ కి ఇద్దరు డైరెక్టర్లు పనిచేసారు..ఆ రెండో డైరెక్టర్ ఇండస్ట్రీ లోనే పెద్ద స్టార్ హీరో..ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు!