Peru: ఆగలేకపోయాడు.. ఆపుకోలేకపోయాడు.. మ్యాచ్ జరుగుతుండగానే.. పని కానిచ్చేసిన ఫుట్ బాల్ ప్లేయర్ : వైరల్ వీడియో

 ఏ క్రీడాకారుడికైనా నియంత్రణ ఉండాలి. ఆట ఆడే క్రమంలో తనను తాను అదుపులో పెట్టుకోవాలి. ఇందులో ఏమాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత అభాసు పాలు కావాల్సి వస్తుంది.

Written By: NARESH, Updated On : August 21, 2024 5:51 pm

Football player urinates during match

Follow us on

Peru : పెరూ దేశంలో ఫుట్ బాల్ కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. అయితే ఈ దేశం తరఫున ఫుట్ బాల్ ఆడుతున్న ఒక క్రీడాకారుడు చేసిన పని పెద్ద ఎత్తున దుమారానికి కారణమైంది. చివరికి అతడు వేటు ఎదుర్కునేందుకు దారి తీసింది. పెరూ దేశంలో థర్డ్ డివిజన్ పేరుతో ఫుట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో అట్లెటికో అవాజున్ జట్టుకు సెబాస్టియన్ మునోజ్ నాగతం వస్తున్నాడు.. మ్యాచ్ మంచి రసవత్తరమైన స్థితిలో ఉండగానే అతడు తట్టుకోలేక.. ఏ మాత్రం ఆపుకోలేక.. మైదానం పక్కనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో మ్యాచ్ రిఫర్ అతనికి రెడ్ కార్డు చూపించి.. స్టేడియం బయటికి పొమ్మని కన్నెర్ర చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది. ఇదే క్రమంలో నెటిజన్లు ఆ ఆటగాడి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెరూ లోని కాంటోర్సిల్లో ఎఫ్ సీ, అట్లెటికో జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గోల్ కీపర్ లూచో రూయిజ్ గాయం కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. రూయిజ్ కు వైద్యులు హుటాహుటిన వచ్చి చికిత్స అందించారు. ఇది జరుగుతుండగానే సెబాస్టియన్ పక్కకు వెళ్లి మూత్రం పోశాడు. అతడు మూత్రం పోస్తున్న దృశ్యాన్ని ప్రత్యర్థి జట్టు ఆటగాడు రిఫరీ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతడికి రెడ్ కార్డ్ జారీ అయింది. ఈ క్రమంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మునాజ్ పట్టారని ఆగ్రహంతో మైదానం బయటకు వెళ్లిపోయాడు . ఈ మ్యాచ్ 0-0 తో డ్రా గా మారింది. వాస్తవానికి మైదానం పక్కన ఫుట్ బాల్ ఆటగాళ్లు మూత్రం పోయడం గతంలో చాలాసార్లు జరిగింది. వారంతా కూడా ఇలానే విమర్శల పాలయ్యారు. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన మాజీ గోల్ కీపర్ లినె కర్ ఇలానే మూత్రం పోస్తూ పరువు తీసుకున్నాడు. పొట్ట ఉబ్బరాన్ని తట్టుకోలేక మైదానం పక్కనే మూత్రం పోశాడు.

మునోజ్ స్టేడియం పక్కనే మూత్రం పోయడంతో అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. “ఆటగాడివై ఉండి ఆ మాత్రం చూసుకోలేవా. స్టేడియం అంటే మూత్రశాల కాదు కదా.. స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడే చూసుకోవాలి కదా.. అలాంటివాడివి భావి ఫుట్ బాలర్ ఎలా అవుతావు? ముందు ఆటను ప్రేమించు. దానిని ఆస్వాదించు. అంతేగాని ఆడే మైదానాన్ని మూత్రశాలగా మార్చకు” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకూడదని.. అవకాశాలు ఇస్తే దేశం పరువు తీస్తారని పెరూ ఫుట్ బాల్ సమాఖ్యకు అభిమానులు సోషల్ మీడియా వేదిక విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇంత జరిగినప్పటికీ మునోజ్ ఎటువంటి క్షమాపణను చెప్పలేదు.