https://oktelugu.com/

‘రాహుల్’ గడ్డం వెనుక రాజమౌళి !

కమెడియన్ రాహుల్ రామకృష్ణ పై నెటిజన్లు ప్రస్తుతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు రాహుల్ ఎందుకు గడ్డం తీయడం లేదు? గత రెండు సంవత్సరాల నుండి ప్రతి సినిమాలో ఫుల్లుగా గడ్డంతోనే కనిపిస్తూ వస్తున్నాడని.. ఒకే లుక్ తో ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు ? అంటూ అతని పై కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాలో రాహుల్ గడ్డం లుక్ తోనే కనిపించి మెప్పించాడు. Also Read: మళ్ళీ పోటీ.. నిలబడాలంటే అదే మెయిన్ […]

Written By:
  • admin
  • , Updated On : March 18, 2021 / 01:38 PM IST
    Follow us on


    కమెడియన్ రాహుల్ రామకృష్ణ పై నెటిజన్లు ప్రస్తుతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు రాహుల్ ఎందుకు గడ్డం తీయడం లేదు? గత రెండు సంవత్సరాల నుండి ప్రతి సినిమాలో ఫుల్లుగా గడ్డంతోనే కనిపిస్తూ వస్తున్నాడని.. ఒకే లుక్ తో ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు ? అంటూ అతని పై కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాలో రాహుల్ గడ్డం లుక్ తోనే కనిపించి మెప్పించాడు.

    Also Read: మళ్ళీ పోటీ.. నిలబడాలంటే అదే మెయిన్ !

    అతని నటనను జనం ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. కాకపోతే అతని లుక్కే కొంత ఇబ్బందిగా ఉందని.. గడ్డం మరి ఓవర్ గా పెరిగిందని విమర్శలు వినిపించాయి. అయితే రాహుల్ రామకృష్ణ గడ్డం తీయకపోవడానికి కారణం రాజమౌళి అట. జక్కన్న తీస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో రాహుల్ నటిస్తున్నాడని.. ఇందులో కొమురం భీం పాత్ర చేస్తోన్న ఎన్టీఆర్ కి అనుచరుడి పాత్రలో రాహుల్ కనిపిస్తాడని.. పైగా రాహుల్ ది ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలుస్తోంది.

    Also Read: డిజాస్ట‌ర్ జాబితాలో ‘గాలి సంప‌త్’.. అన్ని కోట్ల న‌ష్ట‌మా!

    కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా సైన్ చేసినప్పుడే మొత్తం సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు గడ్డం తీయనని ఒప్పందం చేసుకున్నాడని.. పైగా రాజమౌళి తన సినిమాల్లో లుక్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు కాబట్టి.. మధ్యలో తనకు గ్యాప్ ఎక్కువ వచ్చినా ఇప్పటివరకు రాహుల్ షేవింగ్, ట్రిమ్మింగ్ చేసుకోలేదట. ఏప్రిల్ నెలలో “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ పూర్తి అవుతుంది కాబట్టి.. ఏప్రిల్ ఎండింగ్ నాటికి రాహుల్ లుక్ మారబోతుంది అన్నమాట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్