https://oktelugu.com/

మళ్ళీ పోటీ.. నిలబడాలంటే అదే మెయిన్ !

కరోనా పుణ్యమా అని వరుసగా సినిమాలు వచ్చి పడుతున్నాయి. గతవారం మూడు స్ట్రెయిట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగాయి. ఆ పోటీలో ‘జాతిరత్నాలు’ మాత్రమే విజయాన్ని అందుకుంది. ఇక ఈ వారం కూడా మూడు మెయిన్ సినిమాలు పోటీపడబోతున్నాయి. అయితే మూడు సినిమాల్లో చావు కబురు చల్లగా, మోసగాళ్లు సినిమాల పై మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి. ఇక శశి అనే మూడో సినిమా పై మాత్రం ఎవ్వరికీ నమ్మకం లేదు. […]

Written By:
  • admin
  • , Updated On : March 18, 2021 / 01:31 PM IST
    Follow us on


    కరోనా పుణ్యమా అని వరుసగా సినిమాలు వచ్చి పడుతున్నాయి. గతవారం మూడు స్ట్రెయిట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగాయి. ఆ పోటీలో ‘జాతిరత్నాలు’ మాత్రమే విజయాన్ని అందుకుంది. ఇక ఈ వారం కూడా మూడు మెయిన్ సినిమాలు పోటీపడబోతున్నాయి. అయితే మూడు సినిమాల్లో చావు కబురు చల్లగా, మోసగాళ్లు సినిమాల పై మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి. ఇక శశి అనే మూడో సినిమా పై మాత్రం ఎవ్వరికీ నమ్మకం లేదు. అయితే, ఈ సినిమాలో కూడా మంచి మ్యాటర్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ఉంది.

    Also Read: డిజాస్ట‌ర్ జాబితాలో ‘గాలి సంప‌త్’.. అన్ని కోట్ల న‌ష్ట‌మా!

    విడుదలైన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటే మాత్రం నిలబడే సినిమా ఇది. యూత్ కి కావాల్సిన ఎలిమెంట్స్ తో వస్తోందట శశి. ఏది ఏమైనా ఈ మధ్య అన్ని సినిమాలు మౌత్ టాక్ తోనే ఆడుతున్నాయి కాబట్టి.. శశి భవిష్యత్తుకి టాక్ మెయిన్ కానుంది. అలాగే “చావు కబురు చల్లగా” సినిమాలో కార్తికేయ హీరో, లావణ్య త్రిపాఠి హీరోయిన్. పైగా బన్నీ వాసు నిర్మించాడు. అన్నిటికీ మించి ట్రైలర్ బాగుంది. బాగా ట్రెండ్ అయింది.

    Also Read: విజ‌యానికి ‘శ్రీకారం’ చుట్ట‌లేదు.. బాక్సాఫీస్ బాకీ చాలా ఉంది!

    అలాగే కార్తికేయ నటనలో కూడా గత సినిమాలతో పోల్చుకుంటే మంచి పరిణితి కనిపించింది. “ఆర్ ఎక్స్ 100” తర్వాత మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకి, మరి ఈ సినిమాతో ఆ రేంజ్ విజయం దక్కుతుందా అనేది చూడాలి. ఇక మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తీసిన “మోసగాళ్లు” పై కూడా కొంతవరకు అంచనాలు ఉన్నాయి. దానికితోడు హాలీవుడ్ డైరెక్టర్ తీసిన మూవీ ఇది. ఇంకా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ఇలా పెద్ద నటీనటులతో వస్తోన్న సినిమా. మరి మంచు విష్ణుని ఈ సినిమా ఏం చేస్తోందో చూడాలి. ఓవరాల్ గా ఈ మూడు సినిమాలు నిలబడాలంటే టాక్ మెయిన్ కానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్