నాగార్జున సాగర్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు ఉవ్విల్లూరుతున్నారు. టైమ్ వచ్చినప్పుడల్లా ఆయన కాంగ్రెస్‌లోకి మారేందుకు రెడీగా ఉన్నట్లుగా హింట్ ఇస్తున్నారు. ఒకరోజు కాంగ్రెస్‌కు.. మరో రోజు బీజేపీకి జై కొడుతున్నారు. బీజేపీలోకి తనను రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని.. నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని.. కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తాను బీజేపీ నుంచి పోటీచేస్తే జానారెడ్డికి మూడో స్థానమే వస్తుందని జోస్యం చెప్పారు.
Also Read: టీడీపీకి బై.. వైసీపీకి జై.. కామ్రెడ్స్ కొత్త రాగం
సాగర్‌లో బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెదుకుతోంది. కానీ.. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెడుతుందని ఎవరూ అనుకోవడం లేదు. మరోవైపు ఆర్థికంగా బలవంతుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీటైన అభ్యర్థి అవుతారన్న చర్చ మాత్రం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. పోటీ చేయించే అంత వ్యూహం బీజేపీ అమలు చేస్తుందా..? అన్న సందేహం కూడా ఉంది.
ఎందుకంటే బీజేపీలోనే టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. నేతలు పోటీలు పడి ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డిని బతిమిలాడి.. పార్టీలోకి తీసుకుని టిక్కెట్ ఇస్తే.. ఆ నేతలు కలిసి పని చేస్తారా అన్నది బీజేపీ వర్గాలకు ఉన్న అనుమానం. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి నోట బీజేపీ మాట రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చాడు. ఆ సందర్భంలో బీజేపీలో తానే సీఎం అభ్యర్థి చెప్పుకోవడంతో వారు పక్కన పెట్టేశారు.
Also Read: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు బాబు
అప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాట పాడారు. సోదరుడు కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే బీజేపీలోకి పోతానని బెదిరింపులు కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ సాగర్ ఎన్నికలకు ముందు ప్రారంభించారు. ఇలాంటి నిలకడలేని నేతను బీజేపీ సీరియస్‌గా ఆహ్వానిస్తుందా.. పోటీకి దింపుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్