Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli: బాలయ్య విషయంలో వెనకడుగు వేసిన రాజమౌళి...

SS Rajamouli: బాలయ్య విషయంలో వెనకడుగు వేసిన రాజమౌళి…

SS Rajamouli: సినిమా ఇండస్ట్రీలో రాణించడమంటే అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు. మంచి కథను ఎంచుకొని ప్రేక్షకుడికి నచ్చే విధంగా నటించి మెప్పించినప్పుడు మాత్రమే ఒక హీరో స్టార్ హీరోగా ఎదుగుతాడు. ప్రేక్షకులు సైతం అతన్ని ఓన్ చేసుకొని ఆ హీరోలో వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి నటసింహం బాలయ్య బాబు సైతం తన తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నప్పటికి చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. […]

SS Rajamouli: సినిమా ఇండస్ట్రీలో రాణించడమంటే అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు. మంచి కథను ఎంచుకొని ప్రేక్షకుడికి నచ్చే విధంగా నటించి మెప్పించినప్పుడు మాత్రమే ఒక హీరో స్టార్ హీరోగా ఎదుగుతాడు. ప్రేక్షకులు సైతం అతన్ని ఓన్ చేసుకొని ఆ హీరోలో వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి నటసింహం బాలయ్య బాబు సైతం తన తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నప్పటికి చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం… అయితే బాలయ్య బాబుతో రాజమౌళి ఒక సినిమా చేయాల్సి ఉంది. కెరియర్ స్టార్టింగ్ లోనే రాజమౌళి బాలయ్య బాబు కోసం ఒక కథ నైతే రాసుకున్నాడు. కానీ బాలయ్య మాత్రం అప్పుడు బిజీగా ఉండటం వల్ల రాజమౌళికి డేట్స్ అయితే ఇవ్వలేకపోయాడు.

దాంతో వీళ్లిద్దరి కాంబోలో రావాల్సిన సినిమాకి బ్రేక్ పడింది. మొత్తానికైతే ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరిని కలపడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు… ఆ తర్వాత రాజమౌళి బిజీ అవడం బాలయ్య సైతం ఒక సక్సెస్ కోసం ఆరాటపడుతూ ఉండడం జరుగుతూ ఉండేవి.

కానీ బాలయ్యతో మరోసారి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకునే ప్రయత్నం వచ్చినప్పటికి రాజమౌళి ఎందుకో బాలయ్యతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఇప్పటివరకు సెట్ అవ్వలేదు. ఇక మీదట కూడా సెట్ అయ్యే అవకాశాలు కూడా లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నాడు.

కాబట్టి ఆయన తెలుగు హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే తగ్గిపోయాయి. ఇకమీదట ఆయన హాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనే దాని మీదనే తన భవిష్యత్తు ఆధారపడి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper