Samantha: సుకుమార్​ ఆ మాట చెప్పగానే ‘పుష్ప’ స్పెషల్​ సాంగ్​కు సామ్ ఒప్పుకుందట?

Samantha: థియేటర్లలో పుష్పకు తిరుగే లేదనట్లుగా కలెక్షన్లతో దూసుకెళ్లిపోతోంది. స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా డిసెంబరు 17న విడుదలై భారీ రెస్పాన్స్​ను అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కాకముంటే.. ఇందులోని కొన్ని పాటలు రికార్డులు నెలకొల్పాయి. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్​ సాంగ్​ ఊ అంటావా మావ పాటకు యూట్యూబ్ షేక్​ అయిపోయింది. రిలీజ్ అయిన కొన్ని […]

Written By: Raghava Rao Gara, Updated On : December 19, 2021 1:08 pm
Follow us on

Samantha: థియేటర్లలో పుష్పకు తిరుగే లేదనట్లుగా కలెక్షన్లతో దూసుకెళ్లిపోతోంది. స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా డిసెంబరు 17న విడుదలై భారీ రెస్పాన్స్​ను అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కాకముంటే.. ఇందులోని కొన్ని పాటలు రికార్డులు నెలకొల్పాయి. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్​ సాంగ్​ ఊ అంటావా మావ పాటకు యూట్యూబ్ షేక్​ అయిపోయింది.

రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లి. సౌత్​లనే ఫాస్టెస్ట్​ వ్యూస్ సాధించిన పాటగా రికార్డు నెలకొల్పింది. ఇక థియేటర్లలో ఈ పాట చేసిన రచ్చ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అయితే, తాజాగా, సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్పెషల్ సాంగ్​ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా సమంత స్పెషల్ సాంగ్​ చేయడానికి వెంటనే ఒప్పుకున్నారా?. అని అడగ్గా.. సుకుమార్ మాట్లాడుతూ.. ఈ పాట గురించి సామ్​కు చెప్పగానే.. తనకు కరెక్ట్ కాదేమో అని చెప్పింది. అయితే, నటిగా మీకు కొత్తదనాన్ని ఇస్తుందని.. ఈ సాంగ్​ కూడా మీకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పి తనే స్వయంగా సమంతను ఒప్పించినట్లు సుకుమార్​ వివరించారు. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్​ సాంగ్​ గురించి వివరించినా కూడా సమంత నో చెప్పిందని.. ఆ తర్వాత మెల్లగా తన మాటపై నమ్మకంతో ఒప్పుకున్నట్లు సుకుమార్ వివరించారు.