https://oktelugu.com/

Raja Saab Movie : రాజా సాబ్’ స్టోరీ ఆ హాలీవుడ్ క్రేజీ మూవీ తో పోలి ఉంటుందా..? ఇదే నిజమైతే బాక్స్ ఆఫిస్ వసూళ్లు ఊహకు అందదు!

రాజాసాబ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూసాను. హాలీవుడ్ లోని హ్యారీ పోటర్ సిరీస్ ని తలపించాయి. విజువల్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చాయి. డైరెక్టర్ మారుతీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు' అంటూ చెప్పుకొచ్చాడు భూషణ్ కుమార్. ఈ సినిమాతో పాటు, ప్రభాస్ త్వరలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న 'స్పిరిట్' చిత్రానికి కూడా ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 04:55 PM IST

    Raja Saab Movie

    Follow us on

    Raja Saab Movie : రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా సాబ్’. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మొదట్లో అభిమానుల్లో అంచనాలు పెద్దగా ఉండేవి కాదు. డైరెక్టర్ మారుతీ కి వరుస ఫ్లాపులు ఉండడమే అందుకు కారణం. కానీ ఎప్పుడైతే ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియో వచ్చిందో అప్పటి నుండి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ప్రభాస్ ని చాలా కాలం తర్వాత అభిమానులు స్టైలిష్ లుక్ లో చూసారు. అదే విధంగా ప్రభాస్ పుట్టినరోజునాడు విడుదల చేసిన లుక్ చూసి అభిమానులు షాక్ కి గురి అయ్యారు. నోట్లో సిగార్ పెట్టుకొని, నల్లని దుస్తులు ధరించి, రాజు లాగ సింహాసనం పై కూర్చున్న లుక్ చూసేందుకు చాలా కొత్తగా అనిపించింది. దీనిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన భూషణ్ కుమార్ రీసెంట్ గా బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘రాజాసాబ్’ గురించి చెప్పిన పలు కీలక విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలే రాజాసాబ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూసాను. హాలీవుడ్ లోని హ్యారీ పోటర్ సిరీస్ ని తలపించాయి. విజువల్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చాయి. డైరెక్టర్ మారుతీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు భూషణ్ కుమార్. ఈ సినిమాతో పాటు, ప్రభాస్ త్వరలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న ‘స్పిరిట్’ చిత్రానికి కూడా ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ సినిమా విశేషాల గురించి భూషణ్ కుమార్ మాట్లాడుతూ ‘స్పిరిట్ చిత్రం ప్రభాస్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలబడబోతుంది. చాలా పెద్ద స్కేల్ లో డైరెక్టర్ సందీప్ వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. డిసెంబర్ నెలలో మూవీ షూటింగ్ పూజ కార్యక్రమాలను గ్రాండ్ గా ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాం. ఇందులో ప్రముఖ నటులందరూ నటించబోతున్నారు. త్వరలోనే వాళ్ళ వివరాలను తెలియచేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు భూషణ్ కుమార్.

    మెగాస్టార్ చిరంజీవి ని ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం అడిగినట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతుంది. ప్రభాస్ కి గాడ్ ఫాదర్ రోల్ లో చిరంజీవిని చూపించబోతున్నాడట డైరెక్టర్ సందీప్ వంగ. ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి. అదే విధంగా ఈ చిత్రంలో ప్రముఖ కొరియన్ నటుడు ‘డాన్ లీ’ విలన్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడట. అదే విధంగా బాలీవుడ్ నుండి ఒక స్టార్ హీరో కూడా ఈ చిత్రమో కీలక పాత్ర పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి రానున్నాయి.