After 10 pm Internet Shutdown: ప్రస్తుతం కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ విస్తరిస్తోంది. మొబైల్ నుంచి టెలివిజన్ వరకు.. చిన్న ఉద్యోగం నుంచి సాప్ట్ వేర్ వరకు ఇంటర్నెట్ మఖ్య పాత్రగా ఉంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం ఇంటర్నెట్ అవసరం ఉంది. ప్రస్తుతం మన దేశంలో 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో మొబైల్ ఫోన్లు జెట్ స్పీడ్ తో వెళ్తున్నాయి. దీంతో రాత్రి పొద్దుపోయే వరకు మొబైల్ తోనే గుడుపుతున్నారు. కొందరు తెల్లవార్ల దాకా మొబైల్ తోనే ఉంటున్నారు. కానీ ఆ దేశంలో రాత్రి 10 గంటలు దాటాక ఇంటర్నెట్ బంద్ చేస్తారు. ఆ తరువాత నెట్ వర్క్ అసలే రాదు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా?
ఇంటర్నెట్ ఉండడం వల్ల చాలా మంది రాత్రిళ్లు మొబైల్ తోనే గడిపేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా కొందరు మగవాళ్లు ఫోన్ మాయలో పడి భార్యను కూడా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో సంతానోత్పత్తి తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు కూడా వెలువడ్డాయి. సంతానోత్పత్తి తగ్గడం వల్ల జనాభా కూడా తగ్గుతోంది. ఈ క్రమంలో రష్యా దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఉక్రెయిన్ దేశంలో యుద్ధం కారణంగా ఆ దేశం భారీగా సైనికులను కోల్పోయింది. మరోవైపు బాంబుల దాడితో అనేక మంది సాధారణ పౌరులుగా కూడా మరణించారు. కొన్ని ప్రాంతాల్లో ఉపాధి కరువై రాత్రి, పగలు అని తేడా లేకుండా దొరికిని పని చేస్తున్నారు. దీంతో కుటుంబంతో కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు. దీంతో రష్యాలో భారీగా జననాల రేటు తగ్గిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పూర్తిగా నష్టం జరుగుతుందని భావించి.. రాత్రి 10 గంటల తరువాత ఇంటర్నెట్ బంద్ చేయించి సంతానోత్పత్తికి ఎంకరేజ్ చేస్తోంది.
ఇంటర్నెట్ బంద్ చేయడం ద్వారా జనాలు వీటి జోలికి వెళ్లకుండా సంతానోత్పత్తి విషయంలో కేర్ తీసుకుంటారని రష్యా ప్రభుత్వం భావించింది. అందుకే ఈ నిబంధనను పెట్టింది. అంతేకాకుండా సంతానోత్పత్తికి ప్రోత్సాహకాలను కూడా అందించేందుకు సిద్ధమైంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు తొలి రాత్రి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వీరు ఎక్కడైనా హోటళ్లలో బస చేయాలనుకుంటే ఆ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం ప్రతీ జంటకు రూ. 5,000 చెల్లిస్తోంది.
అయితే మొదటి రాత్రి విజయవంతంగా పూర్తి చేసి గర్భం దాల్చే అవకాశాలు ఉన్న వారికి హోటల్ ఖర్చు కింద మొత్తం రూ.26,300 అందించనుంది. ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తిపై శ్రద్ధ తీసుకుంటారని భావిస్తోంది. ఇక మహిళలు ఇంట్లో ఉండడం వల్ల వారు ఏ పని చేయలేకపోతున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. వారికి ఇంటి పనుల కోసం ఆర్థిక సాయం ఇవ్వాలని భావిస్తోంది. ఈ పథకాన్ని రష్యాలోని ఖబరోవ్స్ లో ప్రారంభించింది. 18 నుంచి 23 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ వయసులో బిడ్డను కన్న వారికి 900 యూరోలను ఆర్థిక సాయం కింద అందిస్తారు.