The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో ‘రాజా సాబ్'(Raja Saab Movie) దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది. కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో విడుదలను వాయిదా వేశారు. లేకపోతే ఈ నెల 10వ తారీఖున ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల అయ్యుండేది. ఈపాటికి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ కోలాహాలంతో సందడిగా ఉండేది. అదంతా మిస్ అయ్యాము. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సిద్ధం చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. కానీ ప్రభాస్ నుండి ఎలాంటి అనుమతి రాకపోవడం తో ఆ టీజర్ లో హోల్డ్ లో పెట్టారు. లేకుంటే ఉగాదికి టీజర్ వచ్చేది. టీజర్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ మూవీ కాన్సెప్ట్ ని చూసి షాక్ కి గురి అవుతారట.
Also Read: ఆ స్టార్ నటి బట్టలు మార్చుకుంటుండగా వ్యాన్ లోకి వచ్చిన డైరెక్టర్..
ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇలాంటి విన్నూతన హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటి వరకు రాలేదట. హాలీవుడ్ లో మన చిన్నతనం నుండి హ్యారీ పోటర్ సిరీస్ చిత్రాలను చూస్తూ పెరిగాము. ఈ సినిమా దాదాపుగా ఆ స్టైల్ లోనే ఉంటుందని తెలుస్తుంది. సినిమా విడుదల అయ్యాక కొంతమంది ఇది హ్యారీ పోటర్ రీమేక్ అని కామెంట్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఇక స్టోరీ విషయానికి వస్తే, రాజు గారి బంగ్లా ఉంటుంది, ఆ బాంగ్లో ఎన్నో విశిష్టమైన తపుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో చరిత్ర ఉంటుందట. రాజు గారు ప్రభాస్ యంగ్ క్యారక్టర్ కి తాత అన్నమాట. తన తాటాకు చెందిన ఆస్తి (బంగ్లా) ని దక్కించుకోవడానికి వచ్చిన హీరోకు, ఆ బంగ్లాలో ఎదురైనా అనుభూతులు వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చిందట.
కేవలం VFX వర్క్ విషయం లో ప్రభాస్ అసంతృప్తిగా ఉండడంతో, మళ్ళీ క్వాలిటీ VFX కోసం రీ వర్క్ చేస్తున్నారని, ఈ నెలాఖరుతో ఆ వర్క్ మొత్తం పూర్తి అవుతుందని, ఆగస్టు లేదా, సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇకపోతే ఈ చిత్రం హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రం లో కామెడీ టైమింగ్ ఇరగ కుమ్మేసాడని, చాలా కాలం తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కమర్షియల్ ఎంటర్టైనర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక సీక్వెల్స్ లో నటించడానికి సిద్ధంగా ఉన్న ప్రభాస్, ‘రాజా సాబ్’ సీక్వెల్ లో నటించడానికి కూడా ఒప్పుకున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరికొన్ని వివరాలు సోషల్ మీడియాలో రానున్నాయి.