Raja Saab New Release Date: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజాసాబ్'(Rajasaab Movie) చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతుందని ఇదివరకే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రం, ఎట్టకేలకు సంక్రాంతికి వెళ్లి స్థిరపడింది, ఇక కలెక్షన్స్ టాక్ తో సంబంధం లేకుండా ఇరగ కుమ్మేస్తాయని అభిమానులు చాలా ఆశపడ్డారు. అలా ఆశపడిన ఫ్యాన్స్ కి ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న ఒక వార్త తీవ్రమైన నిరాశకు గురి చేసేలా ఉంది. అదేమిటంటే ‘రాజాసాబ్’ సంక్రాంతి వచ్చే అవకాశాలు చాలా తక్కువట. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. గ్రాఫిక్స్ వర్క్ అప్పటి లోపు పూర్తి అవ్వవు అని, పైగా ఓటీటీ డీల్ కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదని, వచ్చే వారంతో ఈ సినిమా అసలు సంక్రాంతికి వస్తుందా లేదా అనే విషయం తెలుస్తుందని అంటున్నారు.
ఒక సినిమా అనేకసార్లు వాయిదా పడితే అభిమానుల్లో కూడా అంచనాలు తగ్గిపోతాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ, పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ, మంచి పీక్ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న సమయం లో రిలీజ్ అయిన సినిమా ఇది. అయినప్పటికీ కూడా ఓపెనింగ్స్ నుండే బలమైన దెబ్బ పడింది. ఇప్పుడు ‘రాజాసాబ్’ లో కూడా అదే జరుగనుందా అంటే అవును అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక టీజర్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి. ఇక పాటలు విడుదల అవ్వడం తప్ప ఏది మిగల్లేదు. ఈ నెలలోనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేస్తారని అంతా అనుకున్నారు, కానీ చెయ్యలేదు. ఓవరాల్ గా రాజ్ సాబ్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఒకవేళ రాకపోతే మాత్రం ఈ చిత్రం మరో హరి హర వీరమల్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాజాసాబ్ సంక్రాంతికి రాకుంటే ఆ స్థానం లో ఉస్తాద్ భగత్ సింగ్, ‘అఖండ 2’ చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.