Balakrishna vs Sharwanand: కొన్ని కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని కొన్ని సెంటిమెంట్స్ ని గుడ్డిగా నమ్మాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి సెంటిమెంట్స్ లో ఒకటి బాలకృష్ణ(Nandamuri Balakrishna), శర్వానంద్(Sharwanand) సినిమాల మధ్య పోటీ. వీళ్లిద్దరి మధ్య ప్రతీసారి సంక్రాతి సీజన్ లోనే పోటీ పడింది. బాలయ్య తో పోటీపడిన ప్రతీ సారీ శర్వానంద్ కి సూపర్ హిట్స్ అందాయి. ఉదాహరణకు బాలయ్య నటించిన డిక్టేటర్ మరియు శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు 2016 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. ఇక రెండవసారి వీళ్లిద్దరు పోటీ పడిన సందర్భం 2017 సంక్రాంతి. బాలయ్య నటించిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, అదే విధంగా శర్వానంద్ నటించిన ‘శతమానం భవతి’ చిత్రాలు ఈ సంక్రాంతికి పోటీ పడ్డాయి.
రెండు సినిమాలు హిట్ అయ్యాయి కానీ, శతమానం భవతి చిత్రం మాత్రం శర్వానంద్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. ఇక ఇప్పుడు మరోసారి శర్వానంద్ బాలయ్య తో పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బైకర్’ ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త జానర్ తో వస్తున్నాడు, ఈసారి శర్వానంద్ గట్టిగా కొట్టేలాగానే అనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. బాలయ్య నటించిన ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 5 న విడుదల కాబోతోంది. మరోసారి బాలయ్య తో పోటీ పడుతున్నాడు కాబట్టి, కచ్చితంగా ఈసారి కూడా శర్వానంద్ హిట్ అందుకోబోతున్నాడు అని విశ్లేషకులు అంటున్నారు.
ఈమధ్య కాలం లో శర్వానంద్ సూపర్ హిట్ చిత్రాన్ని అందుకొని చాలా కాలమే అయ్యింది. చేసిన ప్రతీ చిత్రం ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆయన చివరి చిత్రం ‘మనమే’ కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్ గా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. కానీ ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అలా ప్రస్తుతానికి కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదురుకుంటున్న శర్వానంద్ ని ఈ సెంటిమెంట్ మరోసారి కాపాడుతుందో లేదో చూడాలి.