Ustaad Bhagat Singh Pre-release Collections: అభిమానులను చాలా కాలం తర్వాత సినిమాల పరంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సంతృప్తి పరిచిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). ‘హరి హర వీరమల్లు’ లాంటి దారుణమైన ఫలితంగా తర్వాత, పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాల్లో #RRR రికార్డు ని బద్దలు కొట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో కూడా పవన్ రేంజ్ కి తగ్గ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఓజీ కి కేవలం తెలుగు వెర్షన్ నుండే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంతే కాకుండా మొదటి రోజు ఓపెనింగ్ ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా వచ్చాయి. అయితే ఈ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు, ఈ రేంజ్ క్లోజింగ్ కలెక్షన్స్ పవన్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్(‘Ustad Bhagat Singh) కి వస్తాయా లేదా అని అభిమానుల్లో చిన్నపాటి సందేహం నెలకొంది.
ఎందుకంటే ఒకప్పటి పరిస్థితులు వేరు,ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఒక రొటీన్ కమర్షియల్ మాస్ సినిమా. ఒకప్పటి లాగా ఇప్పుడు మాస్ సినిమాలను ఆడియన్స్ అంతగా ఆదరించడం లేదు. ముఖ్యంగా పవన్ లాంటి సూపర్ స్టార్స్ నుండి రొటీన్ కమర్షియల్ సినిమాలను అసలు కోరుకోవడం లేదు ఆడియన్స్. వాళ్లకు ఓజీ, సలార్ లాంటి చిత్రాలు కావాలి. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఓజీ కి వచ్చినంత వసూళ్లు వస్తాయా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుండి రాబోయే రోజుల్లో మంచి ప్రమోషనల్ కంటెంట్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయి. మంచి సీజన్ లో మంచి టాక్ పడితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ కంటే మంచి వసూళ్లు వస్తాయని అంటున్నారు.
కానీ ఓవర్సీస్, నైజాం వంటి ప్రాంతాల్లో మాత్రం ఈ చిత్రానికి ఓజీ కి వచ్చినంత వసూళ్లు రావు అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి ఆడియన్స్ కమర్షియల్ సినిమాలను చూడడం పూర్తిగా మానేశారు. కేవలం భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. ఓవరాల్ గా ఓపెనింగ్స్ కచ్చితంగా ఓజీ కంటే తక్కువే ఉండొచ్చు కానీ, టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ దద్దరిల్లిపోతాది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సన్నివేశాలను పూర్తి చేసి చాలా రోజులైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల చివరికి ఈ చిత్రం పూర్తి అవ్వనుంది. మార్చ్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.