OG Movie Records : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేటి తరం యూత్ ఆడియన్స్ కి తగ్గట్టుగా సినిమా చేస్తే క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘ఓజీ'(They Call Him OG) మూవీ ఒక నిదర్శనం. ఈ సినిమాని ప్రకటించిన రోజే నేషనల్ లెవెల్ లో సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టాయి. ఇక 2023 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో ఈ సినిమాకు తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేసింది ఆ గ్లింప్స్ వీడియో. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి రీసెంట్ గానే సెప్టెంబర్ 25 న విడుదల అవ్వబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అలా ప్రకటించారో లేదో, ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అన్ని ప్రాంతాల్లో హాట్ కేక్ లాగ జరుగుతుంది. నైజాం ప్రాంతం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఆయన అక్షరాలా 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ‘కల్కి’, ‘సలార్’, #RRR, ‘పుష్ప 2’ చిత్రాలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగలేదని సమాచారం. #RRR చిత్రానికి 75 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, ‘పుష్ప 2’ చిత్రానికి 85 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఓజీ కి మాత్రం ఏకంగా 90 కోట్ల రూపాయిల బిజినెస్ జరగడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది. #RRR చిత్రానికి ఆ రేంజ్ బిజినెస్ జరగడానికి కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు రాజమౌళి.
Also Read : సరికొత్త పోస్టర్ తో ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..షేక్ అయిన సోషల్ మీడియా!
ఇక ‘పుష్ప 2’ కి ఆ రేంజ్ బిజినెస్ జరగడానికి కారణం సీక్వెల్ అనే క్రేజ్ కాబట్టి. కానీ ఓజీ చిత్రానికి ఆల్ టైం రికార్డు స్థాయిలో 90 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగడానికి కారణం కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ జనరేషన్ స్టార్ హీరోలలో మొదటి నుండి పవన్ కళ్యాణ్ కి నైజాం ప్రాంతంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అత్యధిక డే 1 ఆల్ టైం రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, ఫుల్ రన్ రికార్డ్స్ , రీ రిలీజ్ రికార్డ్స్ ఇలా అన్నిట్లోనూ పవన్ కళ్యాణ్ రేంజ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అలాంటి క్రేజ్ ఉన్న హీరో క్రేజు కాన్సెప్ట్ తో ఒక సినిమా చేస్తే ఇలాగే ఉంటుంది మరి. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు ఎంత క్రేజ్ రాబోతుందో, ఎంత బిజినెస్ జరగబోతుందో చూడాలి.