Raja Saab Trailer Review: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజాసాబ్'(The Rajasaab Movie) మూవీ మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కల్కి తర్వాత ప్రభాస్ నుండి రెండేళ్ల గ్యాప్ తర్వాత విడుదల అవుతున్న సినిమా ఇది. ఇంత గ్యాప్ ఈమధ్య కాలం లో ప్రభాస్ ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రతీ ఏడాది తన వైపు నుండి సినిమా మిస్ కాకుండా చూసుకుంటూ వచ్చాడు. కుదిరితే ఆయన నుండి రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కదా, దీనిపై ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో అంచనాలు వేరే లెవెల్ లో ఉండాలి. కానీ అది జరగలేదు. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత తక్కువ అంచనాలతో విడుదల అవ్వబోతున్న సినిమాగా పిలుస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ తర్వాత అయినా అంచనాలు పెరుగుతాయేమో అని అనుకున్నారు, కానీ అది కూడా జరగలేదు.
ఇక కాసేపటి క్రితమే మూవీ టీం ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాగా హైప్ లేపారు. కానీ ట్రైలర్ ని చూస్తే అంత హైప్ ఉన్న అంశాలు ఏమి లేవే అని అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా థమన్ స్థాయిలో లేదు. ఆయన గత చిత్రాలు ఓజీ , అఖండ 2 తో పోలిస్తే ‘రాజా సాబ్’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంత లైట్ గా ఉందేంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ మొత్తం చూస్తుంటే ప్రభాస్ తో డైరెక్టర్ మారుతీ ఏవేవో చేయించాడు అని అర్థం అవుతుంది. కానీ ఏది కూడా ప్రేక్షకులకు ఎక్కలేదు. తికమక ఫీలింగ్ కలిగింది. లాస్ట్ షాట్ అభిమానులకు సూపర్ గా అనిపించొచ్చు. కానీ ఇతర హీరోల అభిమానులకు మాత్రం ట్రోల్ స్టఫ్ అని చెప్పొచ్చు.
ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో అలాంటి జోకర్ గెటప్ వేయించి ఫైట్ సన్నివేశం పెడితే ఎలా వర్కౌట్ అవుతుందో మారుతీ కే తెలియాలి. ఇక ట్రైలర్ లో అత్యదిక షాట్స్ గతం లో విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ లో కొనసాగింపుగా ఉన్నట్లుగానే అనిపించింది కానీ, కొత్తగా ఏమి అనిపించలేదు. గ్రాఫిక్స్ వర్క్ మాత్రం బాగానే సెట్ చేశారు. కానీ ప్రభాస్ రాజు గెటప్ లో పైన నుండి క్రిందకు పడుతున్న షాట్ VFX మాత్రం చాలా చీప్ గా అనిపించింది. సినిమాలో కూడా ఇలాంటి VFX షాట్స్ ఉంటే ఆడియన్స్ క్షమించరు. ఇక సంజయ్ దత్ క్యారక్టర్ మాత్రం ఈ సినిమాకు హైలైట్ అయ్యేలా ఉంది. ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఈ రెండు అంశాలే సినిమాని కాపాడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
