Raja Saab Controversy: నిన్న రాత్రి ప్రభాస్(Rebel Star Prabhas) ఫ్యాన్స్ పడిన టెన్షన్, టాలీవుడ్ చరిత్ర లో ఇప్పటి వరకు ఏ హీరో అభిమాని కూడా పడలేదు అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్, రెగ్యులర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ తెలంగాణ లో మాత్రం ఎలాంటి చప్పుడు లేదు. ప్రభాస్ అభిమానులు ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సమయం గడిచిపోతుంది కానీ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. కనీసం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడితే, దానికైనా చేసుకుందామని చూసారు , అది కూడా జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. నిర్మాతలు మాత్రం టికెట్ రేట్స్ కోసం తెగ ప్రయత్నాలు చేసారు. ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
ఇక థియేటర్స్ బయట ప్రీమియర్ షోస్ కోసం బారులు తీసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి షో వెయ్యకపోతే థియేటర్స్ బద్దలు అయిపోయే పరిస్థితి ఉండడం తో మామూలు రేట్స్ తోనే లిమిటెడ్ గా నిన్న కొన్ని ప్రీమియర్ షోస్ వేశారు. ఇక ఆ తర్వాత కొద్దిగంటలకు టికెట్ హైక్స్ తో రెగ్యులర్ షోస్ ని కూడా మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు రెగ్యులర్ షోస్ కి టికెట్ రేట్స్ పెంచినందుకు తెలంగాణ హై కోర్టు ప్రభుత్వం పై చాలా సీరియస్ అయ్యింది. స్వయంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇక మీదట టికెట్ రేట్స్ పెంచబోము అని చెప్పిన మరుసటి రోజే ఇలా రేట్స్ పెంచుతూ మెమోలు రిలీజ్ చేయడమేంటి? ఎన్ని సార్లు చెప్పినా మా మాట వినరా?, పట్టించుకోరా?, ఎందుకు పదే పదే ఇలా చేస్తున్నారు? అంటూ తీవ్ర స్థాయిలో హై కోర్టు మండిపడింది. తక్షణమే రాజా సాబ్ కి ఇచ్చిన టికెట్ రేట్స్ జీవో ని వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
మరో పక్క ‘రాజాసాబ్’ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం వరకు జరిగిపోయాయి. కేవలం హైదరాబాద్ సిటీ లోనే రేపటికి 4 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా నమోదు అయ్యాయి. ఇలాంటి సమయం లో ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గించి, బుక్ చేసుకున్న జనాలకు రీ ఫండ్ చేస్తారా?, లేదా సోమవారం నుండి తగ్గిస్తారా అనేది చూడాలి. ఒకవేళ సోమవారం నుండి తగ్గించకపోతే అధికారులపై తీవ్రమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది . చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఓజీ , హరి హరవీరమల్లు చిత్రాలకు కూడా ఇలాగే టికెట్ రేట్స్ తగ్గించాల్సి వచ్చింది.