The Raja Saab Collection: మన టాలీవుడ్ నుండి మొదటి రోజు అత్యధిక 100 కోట్ల గ్రాస్ వసూళ్ల సినిమాలు ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) మాత్రమే. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి చిత్రాలు మొదటి రోజున వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నాయి. ఈ రికార్డు కి దరిదాపుల్లో కూడా మరో టాలీవుడ్ హీరో లేదు. ఎన్టీఆర్ దేవర తో, పవన్ కళ్యాణ్ ఓజీ తో , అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రాలతో మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నారు. అయితే వరుసగా మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ప్రభాస్, ఇప్పుడు నాల్గవ సారి ‘రాజా సాబ్'(The Rajasaab Movie) తో మరో వంద కోట్ల గ్రాస్ ని మొదటి రోజు అందుకోబోతున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ విడుదలకు ముందు చెప్పుకొచ్చారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు, ఈ చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే మొదటి రోజు 70 నుండి 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వరల్డ్ వైడ్ గా వస్తుందని అంటున్నారు. ఇది మంచి ఓపెనింగ్ అయినప్పటికీ ప్రభాస్ రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ టాక్ కూడా పాజిటివ్ గా రాలేదు కాబట్టి, వంద కోట్ల గ్రాస్ ఈసారి మిస్ అయ్యినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా వసూళ్లు బిలో యావరేజ్ రేంజ్ లో వచ్చాయి అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 28 నుండి 30 కోట్ల రూపాయిల రేంజ్ లోనే షేర్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి.
ఎందుకంటే ‘రాజా సాబ్’ కంటే అవుట్ రైట్ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మొదటి రోజున వచ్చాయి. ‘రాజా సాబ్’ కనీసం 42 కోట్ల షేర్ ని రాబడుతుందని అనుకున్నారు. ఇంతలా దెబ్బ వేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నైజాం ప్రాంతం లో ప్రీమియర్ షోస్ చాలా లిమిటెడ్ గా పాడడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆ కారణం చేత రెగ్యులర్ షోస్ మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకున్నాయి. ప్రభాస్ ని నైజాం ప్రాంతం లో కింగ్ అని ఎందుకు పిలుస్తారో ఈ చిత్రం ఓపెనింగ్స్ ఒక ఉదాహరణ. ఈ ప్రాంతం లో మొదటి రోజు ఈ చిత్రానికి పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.