యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయాడు. ఒకప్పుడు ఒక్క హిట్ కొట్టినా కనీసం పదేళ్ల కెరీర్ ఉంటుంది ఆ హీరోకి. కానీ ఇప్పడు అలా లేదు. ఒక్క ప్లాప్ తో హీరోలు తమ మార్కెట్ ను కోల్పోతున్నారు. ఇక వరుసగా రెండు మూడు ప్లాప్ లు వస్తే.. ఇక ఆ హీరో, జీరోగా మిగిలిపోతున్నాడు. ప్రస్తుతం ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో రాజ్ తరుణ్ పరిస్థితి అలాగే అయిపొయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అంటూ వచ్చిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా నెమ్మదిగా సాగే కథనంతో పాటు మరీ నాటకీయంగా సాగుతూ మొత్తానికి బోరింగ్ అనిపించుకుంది. హిట్ కోసం పడిగాపులు కాస్తున్న రాజ్ తరుణ్ కి మళ్ళీ మరో ప్లాప్ ను ఇచ్చింది ఈ సినిమా.
Also Read: డ్రైవర్ ను మోసం చేయడం పై ముమైత్ ఖాన్ వివరణ !
పాపం ఈ సినిమా హిట్ అవ్వడం గ్యారంటీ అనుకుని, వచ్చిన చిన్న సినిమాలను కూడా కాదనుకుని ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు. దాంతో ఈ కుర్ర హీరో పరిస్థితి నిండా మునిగిపోయినట్టు అయింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా ఎదిగి.. అంతే స్పీడ్ గా పడిపోయాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సినిమా జనాలు. మొత్తానికి ఈ సినిమా పై రాజ్ తరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నా… సినిమా బకెట్ తన్నేసింది. ఇప్పుడు రాజ్ తరుణ్ అనేవాడు ఒక ప్లాప్ హీరో అని ఆడియన్స్ చెప్పుకోవాల్సి వచ్చేసిందని రాజ్ తరుణ్ తెగ టెన్షన్ పడుతున్నాడట.
Also Read: ‘ప్రగతి’ ఆంటి నుండి మరో వీడియో వైరల్ !
నిజానికి ఒరేయ్ బుజ్జిగా మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో సాగినా.. రొటీన్ తంతు వ్యవహారాలతోనే సినిమాని ఎక్కువుగా నింపడటంతో సినిమా పోయింది. ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ తో డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ పరిస్థితి కూడా అసలు బాగాలేదు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సినిమాల కోసం నానా అగచాట్లు పడిన కొండా విజయ్ కుమార్ కెరీర్ కి కూడా ఈ ఒరేయ్ బుజ్జిగా సినిమా బాగా దెబ్బ వేసింది. ఏది ఏమైనా ఈ సినిమా బ్యాడ్ టాక్ తో రాజ్ తరుణ్ తో పాటు కొండా కూడా ఇక సర్దుకోవడమేనేమో. మళ్ళీ మరో హిట్ కొట్టే దాకా వీళ్ళకు ఇక అసలు మార్కెట్ లేనట్టే. పాపం బుజ్జిగాడు వీరిద్దర్నీ మొత్తానికి ముంచేశాడు !