Raj Tarun and Hebba Patel : అందం తో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, టాలీవుడ్ లో ఉన్నతస్థానానికి చేరుకోలేకపోయిన హీరోయిన్స్ లో ఒకరు హెబ్బా పటేల్(Hebah Patel). రాజ్ తరుణ్(Raj Tarun) హీరో గా నటించిన ‘కుమారి 21 F’ చిత్రం ద్వారా ఈమె వెండితెర కు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. హీరో రాజ్ తరుణ్ కంటే హెబ్బా పటేల్ కి మంచి పేరొచ్చింది. కచ్చితంగా ఈమె టాలీవుడ్ లో పెద్ద రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఎటు కాకుండా పోయింది. రీసెంట్ గా ఈమె ‘ఓదెల 2’ చిత్రంలో నటించింది. ‘కుమారి 21 F’ తర్వాత హెబ్బా పటేల్ కి మంచి పేరుని తెచ్చిపెట్టిన చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’. ఆ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన ‘ఓదెల 2’ కూడా హెబ్బా కి మంచి పేరుని తీసుకొచ్చింది.
Also Read : ఫ్రాక్ లో కిరాక్ ఫోజులు… కుమారి 21 ఫేమ్ హెబ్బా గ్లామరస్ లుక్ వైరల్!
అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె రాజ్ తరుణ్ గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీ లో ఎవరిదగ్గరైన పూర్తి స్థాయిలో కంఫర్ట్ ఫీల్ అయ్యానంటే అది రాజ్ తరుణ్ తో మాత్రమే. అతని దగ్గర ఒక్కటే నేను నాలాగా ఉండేదానిని. నాకు తెలుగు ఎక్కువగా వచ్చేది కాదు, ఆ సమయంలో రాజ్ తరుణ్ నాకు తెలుగు నేర్పించడంలో చాలా సహాయం చేసాడు. అంతే కాకుండా తనతో నాకు ఎన్నో క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. అవి తల్చుకుంటే ఇప్పటికీ నాకు చాలా సంతోషం గా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈమధ్య కాలంలో వివాదాల్లో ఎక్కువగా కనిపిస్తున్న రాజ్ తరుణ్ పై ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ రావడం నిజంగా కాస్త అతనికి ఊరట లభించింది అనొచ్చు.
ఇది ఇలా ఉండగా ఎవరినైనా ప్రేమించారా అని హెబ్బా పటేల్ ని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తూ ‘హా ప్రేమించాను,కానీ ఆ ప్రేమ నాతో ఎక్కువ కాలం నిలబడలేదు. నేను ఒక లవ్ ఫెయిల్యూర్ ని. నా లవ్ బ్రేకప్ అయ్యినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను. నాలో నేను ఎంతగానో కుమిలిపోయాను. చాలా కాలం వరకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది. మీరు ప్రేమించింది సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తినా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, హెబ్బా పటేల్ సమాధానం చెప్తూ ‘కాదు, ఇండస్ట్రీ తో అతనికి సంబంధం లేదు. బయట వాళ్ళు’ అంటూ చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : కేవలం డబ్బు కోసమే చేశాను: హెబ్బా పటేల్