Chiranjeevi and Nayanthara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నయనతార(Nayanathara) కాంబినేషన్ లో ఇప్పటి వరకు సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడాయి. ఒక సినిమాలో చిరంజీవికి భార్య గా నటించిన నయనతార, మరో సినిమాలో చిరంజీవి కి చెల్లిగా నటించింది. ఏ పాత్రలో ఆయన పక్కన కనిపించినా, చూడముచ్చటగా అనిపించింది. చిరంజీవి కి కూడా రీ ఎంట్రీ తర్వాత ఆయన నటించిన హీరోయిన్స్ లో నయనతార ది బెస్ట్ అనిపించింది. అందుకే ఆయన త్వరలో అనిల్ రావిపూడి తో చేయబోతున్న సినిమాలో కూడా తన పక్కన హీరోయిన్ గా నటించేందుకు నయనతార అయితే బాగుంటుందని, ఈ పాత్రకు ఆమె మాత్రమే న్యాయం చేయగలుతుందని చిరంజీవి అనిల్ రావిపూడి తో అన్నాడట. అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా ఈ ఐడియా చాలా బాగుందని ఒప్పుకొని నయనతార వద్దకు వెళ్ళాడట.
Also Read : 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను అంటూ నయనతార షాకింగ్ కామెంట్స్..ఇంత పగ ఎందుకు?
స్టోరీ మొత్తం వినిపించిన తర్వాత ఆమె నటించేందుకు ఒప్పుకుంది. కానీ ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ చిత్రం లో నటించేందుకు ఆమె అక్షరాలా 18 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట. ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తీసుకుంటున్నారు కానీ, రెగ్యులర్ హీరోయిన్ పాత్రకు ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన మొట్టమొదటి సౌత్ హీరోయిన్ కేవలం నయనతార మాత్రమే అని చెప్పొచ్చు. మరి చిరంజీవి కి ఈ విషయం చెప్పిన తర్వాత, ఆయన ఓకే అంటే తప్పనిసరి పరిస్థితి లో నయనతార కోరినంత రెమ్యూనరేషన్ ని ఇచ్చి హీరోయిన్ గా తీసుకోవాల్సిందే.
కానీ అనిల్ రావిపూడి కి ఇలాంటి హీరోయిన్స్ తో కంఫర్ట్ ఉండదు. ఎందుకంటే ఆయన సినిమాని ఎంత ఇష్టంతో తెరకెక్కిస్తాడో, ప్రొమోషన్స్ ని కూడా అదే రేంజ్ లో ఇష్టం తో చేస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో చేసాడో మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హిస్టరీ లోనే తన ప్రొమోషన్స్ తో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా హీరోయిన్స్ కూడా ఈ ప్రొమోషన్స్ లో పాల్గొనేలా చేసాడు. కానీ నయనతార సంగతి మన అందరికీ తెలిసిందే కదా. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడమే ఆమెకు తెలుసు. ప్రొమోషన్స్ లాంటివి చేయనని అగ్రిమెంట్ పై సంతకం చేసే సమయంలోనే చెప్పేస్తుంది. అందుకు ఒప్పుకుంటేనే ఆమె ఒక సినిమాకు డేట్స్ ని కేటాయిస్తుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా చేస్తే వీటికి ఆమె అసలు ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారిన అంశం.
Also Read : పాపిట కుంకుమ కనిపిస్తే హీరోయిన్ కి పెళ్లి చేసేస్తారా ?