Mobile Discount : స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా.. మీ కోరికను త్వరలోనే నెరవేర్చుకోవచ్చు. అమెజాన్ మే 1 నుండి అదిరిపోయే సేల్‌తో వస్తోంది. ఇందులో ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఎన్నో ఆఫర్లతో తక్కువ ధరలోనే నచ్చిన ఫోన్ సొంతం చసుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ సేల్‌లో ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? ఇతర ఆఫర్లు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
Also Read: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే.. పది టీమ్ లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ త్వరలో భారీ సేల్‌తో మీ ముందుకు రాబోతుంది. ఈ సేల్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఈ ఆఫర్లను 12 గంటల ముందుగానే పొందవచ్చు. అంతేకాదు, బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే వారికి అదనంగా 10శాతం స్పెషల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్‌లో ఐఫోన్‌తో పాటు వన్‌ప్లస్, వివో, రియల్‌మీ, ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను కూడా తగ్గింపు ధరలో కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్
రాబోయే ఈ సేల్ ఈవెంట్‌లో వినియోగదారులు అమెజాన్ గిఫ్ట్ కార్డులను ఉపయోగించి అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాదు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఎన్నో ఎట్రాక్టివ్ ఆఫ్షన్లను కూడా అమెజాన్ అందిస్తోంది.
ఏయే ఫోన్లపై డిస్కౌంట్ లభిస్తుంది?
ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఎం35 5జీ వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్‌తో పాటు షియోమీ, ఒప్పో, వివో, ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లను కూడా తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలపై డిస్కౌంట్
అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం, లెనోవో, ఆసుస్, హెచ్‌పి వంటి బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, ఇతర గృహోపకరణాలపై కూడా డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో కొనసాగుతున్న డిస్కౌంట్లను పరిశీలిస్తే, ఐఫోన్ 15 ప్రస్తుతం 23 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 61,390కి లభిస్తోంది. దీనిని మీరు నో కాస్ట్ ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. దీనిలో మీరు నెలకు రూ. 2,976 మాత్రమే ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: కేఎల్ రాహుల్ కాంతారా స్టెప్ వేసి టీజ్ చేసిన కోహ్లీ: వీడియో వైరల్