Raj Nidimoru sister emotional: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) రీసెంట్ గానే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ని పెళ్ళాడి కొత్త జీవితం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె అంటే పడని వాళ్ళు ఈ పెళ్లి పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు కానీ, ఆమెని ఇష్టపడేవాళ్ళు మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారిలో రాజ్ నిడిమోరు సోదరి శీతల్ కూడా ఉంది. ఈమె మాట్లాడుతూ ‘చంద్రకుండ్ లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నాను, ఈ సందర్భంగా ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. సమంత రాకతో మా కుటుంబం పరిపూర్ణం అయ్యింది. వీరికి మేమంతా అండగా ఉంటాము. మా అన్న, వదిన జంటని చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సమంత రిప్లై ఇస్తూ ‘లవ్ యూ’ అని అంటుంది.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా, నటిగా పరిచయమైనా వీళ్లిద్దరు, ఆ తర్వాత మంచి స్నేహితులు అవ్వడం, కాలం గడిచే కొద్దీ ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, అభిమానులకు ఇదంతా నిజంగా ఒక కలగానే అనిపిస్తుంది. ఎందుకంటే నాగ చైతన్య, సమంత జంట అప్పట్లో మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగా అనిపించేది. నాలుగేళ్ల నుండి ప్రేమించుకుంటూ వచ్చిన వాళ్లిద్దరూ, నాలుగేళ్ల వైవాహిక జీవితంతో తమ రిలేషన్ కి శుభం కార్డు వేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. తప్పు సమంత వైపు నుండి ఉందా?, లేకపోతే రాజ్ నిడిమోరు వైపు నుండి ఉందా అనేది ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. కానీ జరుగుతున్న ఈ సంఘటనలు అన్నీ చూస్తుంటే కాసేపు సమంత కరెక్ట్ అనిపిస్తుంది, మరి కాసేపు నాగ చైతన్య కరెక్ట్ అనిపిస్తాడు. వీళ్ళు ఎందుకు విడిపోయారు అనే విషయం అప్రస్తుతం. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఇప్పుడు బిజీ అయిపోయారు కాబట్టి, భవిష్యత్తులో కూడా ఇక ఈ అంశం పై చర్చలు రావేమో.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో నటిస్తోంది. తనతో బేబీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన నందిని రెడ్డి తో సమంత మరోసారి పని చేయబోతుంది. ఈ చిత్రానికి సమంత నే నిర్మాత కూడా. ఈ చిత్రం తో పాటు తన భర్త రాజ్ నిడిమోరు నిర్మిస్తున్న నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ’ లో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు కానీ, విడుదలైన రోజు మాత్రం ఈ వెబ్ సిరీస్ కి గ్లోబల్ వైడ్ గా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు విశ్లేషకులు.