BIG Shock To Jagan: జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చేసరికి విడదల రజిని పొంగిపోయారు. జీవితాంతం రుణపడి ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇప్పుడు ఆమెను నియోజకవర్గాల చుట్టూ తిప్పుతున్నారు. అయితే తిరిగి తిరిగి ఆమె ఇప్పుడు విసిగిపోతున్నారు. ఇక నియోజకవర్గం అంటూ జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నారు. అదేంటి మంత్రిగా ఇచ్చేటప్పుడు రుణం తీర్చుకోలేనిది అన్నారు కదా.. అందుకే ఫలానా నియోజకవర్గానికి వెళ్లాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా విడదల రజిని కనిపించకుండా మానేశారు. మంత్రి పదవి ఇచ్చిన మాట సరే. కానీ ఈ నియోజకవర్గాల తిప్పుడు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు రజిని. పార్టీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. ఇలా అయితే కుదరదు అని తేల్చి చెబుతున్నారు.
లైట్ తీసుకుంటున్న వైసిపి..
అయితే రజిని వైఖరిలో వైసీపీ శ్రేణులు పెద్దగా మార్పు గమనించడం లేదు. ఎందుకంటే ఆమె మాట తెలుసు వారికి. సైబరాబాద్ మొక్కను సార్ నేను అంటూ చంద్రబాబును నమ్మించారు. అక్కడకు కొద్ది రోజులకే వైసీపీలోకి జంప్ చేశారు. టిడిపిలో ప్లేస్ కల్పించిన ప్రత్తిపాటి పుల్లారావుకే ఝలక్ ఇచ్చారు. పోనీ మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఇలా వెళ్లారో లేదో ఎమ్మెల్యే అయ్యారు. అక్కడకు కొద్ది రోజులకే ఈ రాష్ట్రానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారాన్ని చలాయించారు. అయితే ఇంతటి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరుకు వెళ్ళమని ఆదేశించడమే తరువాయు వెళ్లారు. కానీ ఘోర పరాజయం ఎదురు కావడంతో తన చిలకలూరిపేటకు వచ్చేసారు.
రేపల్లెకు వెళ్లలేక..
అయితే చిలకలూరిపేటలో వద్దు ఈసారి రేపల్లెకు వెళ్ళండి అంటూ రజనీకి ఆదేశాలు ఇచ్చారు జగన్. అయితే మొన్ననే గుంటూరు వెళ్లాను కదా సార్.. రేపల్లె వెళ్లలేను అంటూ సెలవిచ్చారు రజిని. అయితే జగన్మోహన్ రెడ్డి మాటకు ఎదురు చెప్పేసరికి ఆయనకు ఆగ్రహం వచ్చిందట. పోనీ ఏదైనా ఇతర పార్టీలో చేరుదాము అంటే రజనీకి ఆప్షన్ లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేపల్లె వెళ్లాలి. అక్కడ ఏమంత పరిస్థితి బాగాలేదు. కక్కలేక మింగలేక రజిని సతమతమవుతున్నారు. రేపల్లె వెళ్లడం లేదు.. ఉన్న చిలకలూరిపేటలో కనిపించడం లేదు. ఎందుకు వచ్చింది గొడవ అంటూ మళ్ళీ సైబరాబాద్ నీడకు వెళ్ళిపోయారంటూ సెటైర్లు పడుతున్నాయి. చూడాలి ఆమె రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో?