బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ పునర్నవి భూపాలంతో అతి దగ్గరగా ఉన్నాడు రాహుల్ సిప్లిగంజ్. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నారు అంతా. కానీ.. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతా సప్పబడింది. ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు.
ఆ తర్వాత.. అషూరెడ్డితో దగ్గరయ్యాడు రాహుల్. దీంతో.. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని నెటిజన్లు సందేహించారు. ఆ తర్వాత అషూను రాహుల్ ఎత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో.. వీళ్ల మధ్య మ్యాటర్ నడవడమే కాదు.. పరిగెడుతోందని డిసైడ్ అయ్యారు. అయితే.. వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందన్న సంగతి రివీల్ చేయలేదు. దీంతో.. ఎవరికి తోచింది వారు ఊహించేసుకున్నారు.
అయితే.. లేటెస్ట్ గా రాహుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా అషూ రెడ్డితో తన రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు. ఆమె తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన రాహుల్.. ఎలా స్పెషల్ అనేది కూడా చెప్పాడు. ఆమె తనపై చూపించే కేరింగ్ తనకు చాలా ఇష్టమని అన్నాడు.
ఒకసారి తనకు అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే.. వెంటనే రూ.10 వేలు అషూను అడిగినట్టు చెప్పాడు. ఆమె కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా డబ్బులు పంపిందని తెలిపాడు. అలా.. తాను మరెవర్నీ నిర్మొహమాటంగా అడగలేనని చెప్పాడు. ఆ విధంగా తనకు అషూ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు రాహుల్.
అయితే.. ఆ ఇంటర్వ్యూ చూసిన అషూ ఎమోషన్ అయ్యింది. ‘థాంక్యూ రాహుల్.. నాకు ఏడుపువస్తోంది. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్’ అని తన ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసింది. ఆ విధంగా.. తనకు అషూ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Rahul sipligunj open comments on relation with ashu reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com