హీరోయిన్లు బరువు తగ్గడం అనేది అతి సాధారణమైన విషయం. సావిత్రి, జమున కాలంలో హీరోయిన్లు కాస్త కండ చేసి బొద్దుగా ఉంటే ఇష్టపడేవాళ్లు. ఐతే కాలంతో పాటు ఇష్టాలు కూడా మారాయి. ఇప్పుడంతా స్లిమ్ గా సన్నగా ఉంటేనే ఇష్ట పడుతున్నారు. అందుకే హీరోయిన్లు బరువు పెరగరు. పెరిగితే సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవ్వాలి. అందుకే కాస్త మధ్యలో లావు పెరిగితే హీరోయిన్ల పై బ్యాడ్ కామెంట్స్ వస్తాయి.
ఆ బ్యాడ్ కామెంట్స్ భరించలేకే, కొంతమంది హీరోయిన్లు ఉన్నఫలంగా బరువు తగ్గడానికి సర్జరీలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక హీరోయిన్ సడెన్ గా బరువు తగ్గింది అంటే మాత్రం, ఆ తగ్గింపు వెనుక ఏదో ఉందనే అర్థం చేసుకోవాలి. అయితే హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు మాత్రం సర్జరీలు అక్కర్లేదు. కేవలం వర్కౌట్స్ తోనే బరువు తగ్గడం, మళ్ళీ తక్కువ టైంలోనే బరువు పెరడం పాయల్ కి మేకప్ తో పెట్టిన విద్య అట.
ఈ మధ్య పాయల్ కాస్త స్లిమ్ అయింది. పర్ఫెక్ట్ ఫిజిక్ ఉంటేనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయని అమ్మడు ఫీల్ అయి.. కడుపు ఖాళీ చేసుకుంటూ.. ఇష్టమైన ఫుడ్ ను దూరం చేసుకుంటూ మొత్తానికి సన్నబడింది. జస్ట్ నెల రోజుల్లో 6 కిలోలు తగ్గిందట పాయల్. సహజంగానే పాయల్ ఫిజిక్ యూత్ ను ఓ రేంజ్ లో పిచ్చెక్కిస్తోంది. మరి ఇప్పుడు సన్నబడి ఇంకా పర్ఫెక్ట్ గా తయారైతే ఇక ఆమె అభిమానులు కళ్ళు తిప్పుకోలేరేమో.
ఇంతకీ పాయల్ వెయిట్ లాస్ వెనుక ఒక అవకాశం ఉంది. పాయల్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి, అక్కడ దర్శక నిర్మాతలు తన పై ఇంట్రెస్ట్ చూపించాలి అంటే.. స్లిమ్ గా నాజుగ్గా కనిపించాలి. అందుకే చాలా కఠినం అయినా పాయల్ వెయిట్ తగ్గింది. ఏది ఏమైనా తక్కువ టైమ్ లోనే బరువు తగ్గడం విశేషం. కొన్ని రోజులు ఉపవాసం ఉంటూ, యోగా, వ్యాయామం కూడా చేసిందట ఈ హాట్ బ్యూటీ.