https://oktelugu.com/

Rahul Ramakrishna’s Net: బూతులతో రెచ్చిపోయిన టాలెంటెడ్ కమెడియన్ !

Rahul Ramakrishna’s Net: టాలెంటెడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ( Rahul Ramakrishna) కూడా హీరో అయ్యాడు. ప్రియదర్శి, సత్య లాంటి వాళ్ళు హీరోలుగా వరుసగా సినిమాలు చేస్తుంటే.. తానూ మాత్రం ఎందుకు కమెడియన్ గా మిగిలిపోవాలి ? అందుకే, తను కూడా హీరో అయ్యాడు. పైగా హీరోగా కొత్తగా కాస్త బోల్డ్ గా ట్రై చేశాడు. అవును, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నెట్ (NET). పేరులోనే కొత్తదనం ఉంది, మరి సినిమాలో […]

Written By:
  • admin
  • , Updated On : August 30, 2021 / 07:04 PM IST
    Follow us on

    Rahul Ramakrishna’s Net: టాలెంటెడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ( Rahul Ramakrishna) కూడా హీరో అయ్యాడు. ప్రియదర్శి, సత్య లాంటి వాళ్ళు హీరోలుగా వరుసగా సినిమాలు చేస్తుంటే.. తానూ మాత్రం ఎందుకు కమెడియన్ గా మిగిలిపోవాలి ? అందుకే, తను కూడా హీరో అయ్యాడు. పైగా హీరోగా కొత్తగా కాస్త బోల్డ్ గా ట్రై చేశాడు. అవును, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నెట్ (NET).

    పేరులోనే కొత్తదనం ఉంది, మరి సినిమాలో కూడా ఉందా ? అంటే, కావాల్సినంత ఉంది అంటున్నాడు రాహుల్. అందుకే, ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రాహుల్ కాస్త వైవిధ్యంగా ముందుకు పోయాడు. ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ తాజాగా పోస్ట్ చేసిన ట్వీట్లు నెటిజన్లుకు షాక్ ఇచ్చాయి. బూతులతో కూడిన ట్వీట్లును రాహుల్ పోస్ట్ చేశాడు.

    కలకలం రేపుతున్న ఈ ట్వీట్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయనే చెప్పాలి. ఇంతకీ నెట్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరోకి.. అంటే, రాహుల్ రామకృష్ణకు అమ్మాయిలను రహస్యంగా చూసే పిచ్చి ఉంటుంది. లేకపోయినా ఉన్న వాడిగా కనిపిస్తాడు రాహుల్ రామకృష్ణ. ఇక ఆ పిచ్చి ఉంది కాబట్టి.. బూతులు కూడా యథేచ్ఛగా వాడుతూ ఉంటాడు.

    అయినా, ఓటీటీ సినిమా కాబట్టి.. బూతులు వాడితే అభ్యతంరం ఏముంది ? అసలు ఓటీటీ చిత్రాల్లో బూతులు వాడని పాత్రలు చాలా తక్కువగా ఉంటాయి కదా, కాబట్టి ఆ పాత్రల శైలినే ఈ సినిమాలో పాత్ర కూడా ఫాలో అయింది అన్నమాట. కాకపోతే సినిమా ప్రమోషన్ కోసం ఇలా బూతులు వాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న.

    నిజానికి ట్విట్టర్ ఫాలోవర్స్ రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేసిన మెసేజ్ లు చూసి షాక్ తిన్నారు. రాహుల్ పోస్ట్ లు కొంచెం వైల్డ్ గా ఉన్న మాట వాస్తవం. అయినా ఈ రోజుల్లో జనాలను ఆకట్టుకోవాలి అంటే.. కాస్త బోల్డ్ గా ప్రమోట్ చేయాలేమో.