https://oktelugu.com/

Raha Kapoor: రణబీర్ కపూర్ – అలియా భట్ కూతురు తన నానమ్మ తో ఎంత క్యూట్ గా ఆడుకుంటుందో చూడండి..సోషల్ మీడియాని ఊపేస్తున్న వీడియో!

ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు రాహా. నిన్న గాక మొన్న పుట్టినట్టుగా అనిపిస్తున్న రాహా అప్పుడే ఆడుకునే స్థితికి వచ్చేసింది. ఇంస్టాగ్రామ్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అలియా భట్ రీసెంట్ గా తన పాప రాహా తన నానమ్మ తో కలిసి ఆడుకుంటున్న వీడియో ని అప్లోడ్ చేసింది. ఇది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. క్యూట్ గా నవ్వుతూ, ఈ పాప తన నానమ్మ కి సైగలు చేస్తూ ఎంత ముద్దుగా ఉందో మీరే చూడండి.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 12:40 PM IST

    Raha Kapoor

    Follow us on

    Raha Kapoor: కొన్ని సెలబ్రిటీ జంటలను చూస్తే ఇలా బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటాము. మన ఇండియా లో అలాంటి అన్యోన్య దాంపత్య జీవితాలు గడుపుతున్న స్టార్ సెలబ్రిటీస్ జంటలు చాలానే ఉన్నాయి. అలాంటి జంటలలో ఒకటి రణబీర్ కపూర్ – అలీ భట్ జంట. బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న ఈ ఇద్దరు 2022 , ఏప్రిల్ 14 వ తేదీన పెద్దల సమక్ష్యం లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. సుమారుగా మూడేళ్ళ నుండి ప్రేమించుకుంటూ, డేటింగ్ చేసుకున్న ఈ జంట పెళ్లి ద్వారా ఒక్కటి అవ్వడం పెద్ద హాట్ టాపిక్. అలియా భట్ బాలీవుడ్ లో టాప్ లీడింగ్ హీరోయిన్స్ లో ఒకరు. కెరీర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడు హీరోయిన్స్ పిల్లల్ని కనడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ విషయం లో అనేక మంది సెలెబ్రిటీలు గొడవపడి విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలియా భట్ పెళ్ళైన కొద్ది నెలలకే పండంటి ఆడ బిడ్డకు జన్మని ఇచ్చింది.

    చూసేందుకు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు రాహా. నిన్న గాక మొన్న పుట్టినట్టుగా అనిపిస్తున్న రాహా అప్పుడే ఆడుకునే స్థితికి వచ్చేసింది. ఇంస్టాగ్రామ్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అలియా భట్ రీసెంట్ గా తన పాప రాహా తన నానమ్మ తో కలిసి ఆడుకుంటున్న వీడియో ని అప్లోడ్ చేసింది. ఇది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. క్యూట్ గా నవ్వుతూ, ఈ పాప తన నానమ్మ కి సైగలు చేస్తూ ఎంత ముద్దుగా ఉందో మీరే చూడండి. అలియా భట్ కేవలం ఈ ఒక్క వీడియో నే కాదు, తనకి తన కూతురుకి సంబంధించి ఇలాంటి వీడియోలు, ఫోటోలు ఇది వరకు ఎన్నో సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. ఇది ఇలా ఉండగా పాప పుట్టిన తర్వాత కూడా అలియా భట్ సినిమాల్లో యాక్టీవ్ గానే కొనసాగుతుంది.

    గత ఏడాది ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాని’ అనే చిత్రం ద్వారా సూపర్ హిట్ ని అందుకున్న అలియా భట్, అదే ఏడాది హాలీవుడ్ లో గేల్ గ్యాడోట్ తో కలిసి ‘హార్ట్ ఆఫ్ ది స్టోన్’ అనే యాక్షన్ చిత్రంలో నటించింది. ఈ ఏడాది ఆమె ‘జిగ్ర’, ‘ఆల్ఫా’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ‘జిగ్ర’ లో కేవలం ఆమె నటించడం మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఇక రణబీర్ కపూర్ సంగతి మన అందరికీ తెలిసిందే. గత ఏడాది ‘ఎనిమల్’ చిత్రం తో ఆయన సృష్టించిన సునామీ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘రామాయణం’ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, త్వరలోనే ‘ఎనిమల్ పార్క్’ లో నటించనున్నాడు. ‘ఎనిమల్’ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కనుంది. ఇలా ప్రస్తుతం వీళ్లిద్దరి కెరీర్ పీక్ రేంజ్ లోనే కొనసాగుతుంది.