https://oktelugu.com/

Chiranjeevi And Rajashekhar: చిరంజీవి కోసం రాసుకున్న కథలోకి వచ్చిన ఆ స్టార్ హీరో…కాదనలేకపోయిన ఆ స్టార్ డైరెక్టర్…

ఇండస్ట్రీ లో సినిమా చేయడం ఎంత ముఖ్యమో సక్సెస్ లను అందుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమాలు సక్సెస్ అయితేనే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : September 16, 2024 / 12:33 PM IST

    Chiranjeevi And Rajashekhar

    Follow us on

    Chiranjeevi And Rajashekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలే ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. ఇక ఒక అప్పుడు చిరంజీవితో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతూ ఉండేవారు ఇక తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ వచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలుతూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఆయన ప్లేస్ ను రిప్లేస్ చేసే హీరో దొరకలేదు అంటే ఆయన ఎంతటి ఘన కీర్తిని సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి చిరంజీవి ఒకానొక సందర్భంలో ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నాడు. ఇక ఆ దర్శకుడు కూడా చిరంజీవికి కథ చెప్పిన తర్వాత మరొక హీరో వచ్చి అదే కథ విని ఆ కథ నాకైతే బాగుంటుంది మనం చేద్దామని చెప్పడంతో చిరంజీవిని సైతం పక్కన పెట్టి ఆ సినిమాని ఇంకొక హీరో తో చేశాడా దర్శకుడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు చిరంజీవి నుంచి కథను తీసుకున్న ఆ హీరో ఎవరు అంటే సినిమా ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరు సంపాదించుకున్న రాఘవేంద్రరావు…

    నిజానికి చిరంజీవితో ఆయన చాలా సినిమాలు చేశాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను కూడా అందించాడు. అయితే ఈ క్రమంలోనే చిరంజీవి తన ఇమేజ్ ని పక్కన పెట్టి ఒక రొమాంటిక్ సినిమాని చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగానే ‘అల్లరి ప్రియుడు’ అనే సినిమా కథని చేయడానికి సిద్ధం అయ్యారు. ఇక చిరంజీవి కి కూడా మాస్ సినిమాలు చేసి బోర్ కొట్టడంతో అదొక చేంజ్ ఓవర్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో రాఘవేంద్రరావు చెప్పిన కథకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.

    కానీ ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గర ఆ కథను విన్న రాజశేఖర్ ఎలాగైనా సరే ఈ సినిమాను తను చేస్తానని చెప్పి చిరంజీవికి కూడా ఒక మాట చెప్పి ఆ కథను తీసుకొని తనే హీరోగా ఆ సినిమా చేశాడు. ఇక రాజశేఖర్ కెరియర్ లోనే ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమాను చిరంజీవి చేసి ఉంటే ఎలా ఉండేది అనే విషయం పక్కన పెడితే చిరంజీవికి మాత్రం ఈ సినిమా ఒక చక్కటి ఇమేజ్ ను ఇచ్చేది. ఇక ఎంటైర్ చిరంజీవి కెరియర్ లో అలాంటి సినిమాలు మాత్రం చిరంజీవి చేయలేదు.

    కాబట్టి అలాంటి లోటును కూడా తీర్చిన సినిమాగా అల్లరి ప్రియుడు సినిమా అయితే చిరంజీవి కెరియర్ లో గుర్తుండిపోయేది. కానీ చిరంజీవి చాలా పెద్ద మనసు చేసుకొని రాజశేఖర్ కోసం ఆ సినిమాని వదిలేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…