https://oktelugu.com/

Siddharth Aditi Rao Marriage: రహస్యంగా జరిగిన హీరో సిద్దార్థ్ – అదితి రావు హైదరీ వివాహం..వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

హీరో సిద్దార్థ్ 2003 వ సంవత్సరం లో మేఘన అనే అమ్మాయిని ముంబై లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. నాలుగు సంవత్సరాలు కలిసి జీవించిన వీళ్ళు కొన్ని విబేధాల కారణం గా 2007 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 12:48 PM IST

    Siddharth Aditi Rao Marriage

    Follow us on

    Siddharth Aditi Rao Marriage: గత కొంత కాలం నుండి ప్రముఖ హీరో సిద్దార్థ్, అదితి రావు హైదరీ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు కొంతకాలం నుండి డేటింగ్ చేసుకుంటూ సోషల్ మీడియా లో అనేక సార్లు కెమెరాలకు చిక్కారు. కానీ ఎక్కడా కూడా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని, డేటింగ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించలేదు. రహస్యం గా మైంటైన్ చేస్తూ వచ్చిన ఈ బంధాన్ని మరో మెట్టు ఎక్కిస్తే నిన్న శ్రీరంగ పురంలోని రంగనాయక స్వామి ఆలయంలో బంధు మిత్రుల సమక్ష్యం లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. హీరో సిద్దార్థ్ 2003 వ సంవత్సరం లో మేఘన అనే అమ్మాయిని ముంబై లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. నాలుగు సంవత్సరాలు కలిసి జీవించిన వీళ్ళు కొన్ని విబేధాల కారణం గా 2007 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు.

    ఆ తర్వాత హీరో సిద్దార్థ్, అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చి టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత తో ప్రేమాయణం నడిపాడు. వీళ్లిద్దరి ప్రేమ పెళ్లి పీటలు వరకు వెళ్ళింది. ఒక గుడిలో పూజా కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. అంతా సిద్ధం అయ్యాక ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ పెళ్లి పెటాకులు అయ్యింది. ఆ తర్వాత సమంత నాగ చైతన్య ని పెళ్లి చేసుకోవడం, సిద్దార్థ్ సోలో గా మిగిలిపోవడం మన అందరం చూసాము. ఇప్పుడు సిద్దార్థ్ పెళ్లి చేసుకున్న ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరీ కి కూడా గతం లో వివాహం జరిగింది. ఈమె 2002 వ సంవత్సరం లో సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2013 వ సంవత్సరం వరకు వీళ్లిద్దరు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కొన్ని విబేధాల కారణం గా విడిపోయారు. సిద్దార్థ్, అదితి రావు హైదరీ 2021 వ సంవత్సరం లో విడుదలైన ‘మహాసముద్రం’ అనే చిత్రం లో కలిసి నటించారు. ఇందులో శర్వానంద్ కూడా మరో హీరో గా నటించిన సంగతి తెలిసిందే.

    ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్దార్థ్, అదితి రావు హైదరీ బాగా దగ్గరయ్యారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని, ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ళు డేటింగ్ చేసుకున్న తర్వాత ఇద్దరు నిన్న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. సిద్దార్థ్ వైవాహిక జీవితం కనీసం అదితి రావు హైదరీ తో అయినా సజావుగా సాగుతుందని ఆశిద్దాం. అదితి రావు హైదరీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా, అలాగే హాలీవుడ్ లో మరో సినిమా చేస్తుంది. అలాగే ఈ ఏడాది సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన ‘హీరా మంది’ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది. ఇక సిద్దార్థ్ సంగతి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాతో భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన సిద్దార్థ్, రీసెంట్ గా ఇండియన్ 2 చిత్రంలో నటించి ఫ్లాప్ ని ఎదురుకున్నాడు.