Rajamouli – Raghavendra Rao : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇక ఆయనకి సినిమా తప్ప వేరే ప్రపంచం అయితే తెలియదు. అందుకే ఎప్పుడు సినిమాలు చేస్తు చాలా బిజీగా గడుపుతూ ఉంటాడు.
ఇక ఆయన తీసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన మొదటి సినిమా అయిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాని చేస్తున్న సమయం లో దర్శకుడు రాజమౌళి అయినప్పటికీ ఆ సినిమా మొత్తాన్ని రాఘవేంద్రరావు దగ్గర ఉండి మరి చూసుకున్నారట. ఇక దానివల్లే కొన్ని సీన్లు రాజమౌళికి నచ్చకున్నా కూడా అందులో ఓకే చేయాల్సి వచ్చిందట… ఇక ఈ సినిమా మొత్తానికైతే రిలీజై మంచి విజయాన్ని సాధించింది.
కానీ రాజమౌళికి మాత్రం ఎక్కడో తీవ్రమైన సంతృప్తి అయితే ఉందట. ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి డైరెక్టర్ ఈయనే అయినప్పటికీ రాఘవేంద్ర రావు గారే అన్ని చూసుకున్నారట. ఇక ఈ సినిమాలో తనకు నచ్చిన ఒక్క ఎలిమెంట్ కూడా లేదట. కాబట్టి వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళి అసలు డైరెక్టర్ గా నేను పనికి వస్తానా? లేదా నాకు నచ్చిన సీన్స్ నేను చాలా బాగా ఎలివేట్ చేస్తూ సినిమా చేయగలనా లేదా అనే డౌట్ అయితే ఆయనలో ఎప్పుడు కలుగుతూ ఉండేదట. ఇక దానికి వాళ్ళ నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ నీలో మంచి టాలెంట్ ఉంది నువ్వు ఎప్పటికైనా మంచి డైరెక్టర్ అవుతావని రాజమౌళికి చెబుతూ ఉండేవారట.
అలా సింహాద్రి, సై లాంటి సినిమాలను తీసి తనని తాను స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఆయన అనుకున్న సీన్ ను అనుకున్నట్టుగా తీయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. ఆయనను మించిన మేకర్స్ ఎవరు లేరు. ఇక ఆయన లాగా కూడా ఎవ్వరు ఎమోషన్స్ ని అంత స్ట్రాంగ్ గా పండించలేరు అనేది మాత్రం వాస్తవం…