https://oktelugu.com/

PAK vs NZ : పాక్ ను నమ్ముకుని క్రికెట్ ఆడితే ఇలానే ఉంటుంది.. న్యూజిలాండ్ జట్టు ముఖం ఎలా ఉందంటే..

ఇక తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మొత్తానికి పాకిస్తాన్ లో ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ కు ఇలాంటి సత్కారం లభించడంతో ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఏకిపారేస్తున్నారు. షెడ్యూల్ నిర్ణయించినప్పుడు తెలియదా? అంటూ దెప్పిపొడుస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2024 9:14 pm
    Pakistan vs New Zealand

    Pakistan vs New Zealand

    Follow us on

    PAK vs NZ : కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదితే ఎలా ఉంటుంది.. ఈ సామెత న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లకు అనుభవంలోకి వచ్చింది.. పాకిస్తాన్ జట్టును నమ్ముకుని క్రికెట్ ఆడేందుకు వచ్చిన వారి పరువు పోయింది.. అంతేకాదు కేవలం రెండు బంతుల్లోనే ఆట ముగియడంతో.. నిరాశతో న్యూజిలాండ్ ఆటగాళ్లు మైదానం వీడి వెళ్లిపోయారు. కేవలం న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రమే కాదు, ఆట చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

    ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ -20 సిరీస్ మొదలైంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రావల్పిండిలో ఏప్రిల్ 18న జరిగింది. ఈ మ్యాచ్ కోసం అటు పాకిస్తాన్, ఇటు న్యూజిలాండ్ స్టేడియం లో ప్రవేశించాయి. టాస్ వేయడం.. మ్యాచ్ ప్రారంభం కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. కానీ రెండు బంతుల తర్వాత ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ మొదలు కాలేదు. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడమే ఇందుకు కారణం. దీంతో ఆట చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశ నిస్పృహలలో కూరుకు పోయారు. అటు మ్యాచ్ చూడకపోవడం.. ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టికెట్ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో.. ప్రేక్షకులు అయ్యో దేవుడా.. ఇలా జరిగిందేంటని ఉసురుమంటూ ఆ వర్షంలోనే ఇళ్లకు వెళ్ళిపోయారు.

    టి20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రావల్పిండిలో జరగాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏప్రిల్ 18న కూడా అక్కడ విపరీతమైన వర్షం కురిసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ వైపు మొగ్గుచూపింది. ఆ జట్టు ఓపెనర్లు కూడా మైదానంలోకి వచ్చారు. పాకిస్తాన్ బౌలర్లు కేవలం రెండంటే రెండే బంతులు వేశారు . వర్షం జోరుగా కురవడంతో అంపైర్లు ఆటను పూర్తిగా రద్దు చేశారు. వాస్తవానికి ఇలాంటి సమయంలో స్టేడియం అవుట్ ఫీల్డ్ తడవకుండా ఉండేందుకు పెద్దపెద్ద టార్పాలిన్లు కప్పుతారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాంటి చర్యలు తీసుకోనట్టు కనిపించింది. దీంతో వర్షం భారీగా కురవడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభం కాలేదు. రెండు బంతుల వరకు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఆసక్తి ఉంది. ఆ తర్వాత వారు కూడా ఇదెక్కడి వర్షం రా భయ్ అనుకుంటూ వెళ్లిపోయారు. ఇక తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మొత్తానికి పాకిస్తాన్ లో ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ కు ఇలాంటి సత్కారం లభించడంతో ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఏకిపారేస్తున్నారు. షెడ్యూల్ నిర్ణయించినప్పుడు తెలియదా? అంటూ దెప్పిపొడుస్తున్నారు.