https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి రికార్డ్ లు బ్రేక్ చేసే సత్తా ఉన్న ఇండియన్ డైరెక్టర్స్ వీళ్లేనా..?

ఇక ఇప్పటివరకు ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒకెత్తూ అయితే ఇకమీదట రాబోయే సినిమాలతో ఆయన చేయబోయే మ్యాజిక్ గానీ ఆయన సాధించే విజయాలు గాని మరొక లెవెల్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2024 / 09:33 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : తెలుగులో తన ప్రస్థానాన్ని కొనసాగించిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన టీమ్ మొత్తాన్ని ఆ వర్క్ మీద కూర్చోబెట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుదు అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాలతో జనాల్లో కానీ బాక్సాఫీస్ దగ్గర గానీ ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇక బాహుబలి సినిమాతో 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు. అలాగే త్రిబుల్ ఆర్ సినిమాతో 1200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీలో రెండు సార్లు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను వసూలు చేసిన మొదటి డైరెక్టర్ గా కూడా రాజమౌళి మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

    ఇక ఇండస్ట్రీలో రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడం అంటే అంత ఆషామాషీ విషయం అయితే కాదు. ఒకవేళ వీటిని బ్రేక్ చేయాల్సి వస్తే మాత్రం ఇండియాలో ఉన్న నలుగురు డైరెక్టర్లకు మాత్రమే ఈ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, లోకేష్ కనకరాజ్… వీళ్ళ నలుగురి సినిమాలు నాలుగు డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి రికార్డులను బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రస్తుతం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు.

    ఇక ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే భారీ వసూళ్లు సాధించాలని చూస్తున్నారు … వీళ్ళు జాగ్రత్త గా సినిమాలు చేస్తేనే తప్ప లేకపోతే మాత్రం రాజమౌళి రికార్డు బ్రేక్ చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ఇక ఇప్పటివరకు ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒకెత్తూ అయితే ఇకమీదట రాబోయే సినిమాలతో ఆయన చేయబోయే మ్యాజిక్ గానీ ఆయన సాధించే విజయాలు గాని మరొక లెవెల్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…