
నటుడు , నృత్య దర్శకుడు అయిన డైరెక్టర్ రాఘవ లారెన్స్.కరోనా ఎఫెక్ట్ తో పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు మూడు కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించిన రాఘవ లారెన్స్ మరో మారు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆ క్రమంలో హైదరాబాద్ లోఉన్న డాన్సర్స్ ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున 10 మందికి 2,.50,000 రూపాయలు పంపడం జరిగింది. అదే విధంగా చెన్నై లో ఉన్న 13 మంది డాన్సర్స్ కి 25,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు రాఘవ లారెన్స్ డైరెక్ట్ గా వారి వారి అకౌంట్లలో డైరెక్ట్ గా వేయడం జరిగింది. అలా డాన్స్ నే నమ్ముకుని,సినీ రంగంలో బతుకుతూ ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్నిరాఘవ లారెన్స్ అందించడం జరిగింది. కష్టకాలంలో ఉన్న నృత్య కళాకారులకు అండగా నిలిచి రాఘవ లారెన్స్ అందరి చేత శభాష్ అనిపించు కొంటున్నాడు.
ప్రభుదేవా దగ్గర నృత్య సహాయకుడిగా చేరి 1993 లో వచ్చిన `ఉళైప్పాలి ` చిత్రం తో సినీ రంగ ప్రవేశం చేసాడు.1997 లో వచ్చిన `హిట్లర్ `తెలుగు చిత్రం తో డాన్స్ డైరెక్టర్ గా మారాడు. ఇక 1999 లో వచ్చిన `స్పీడ్ డాన్సర్` తెలుగు చిత్రం తో నటుడిగా మారి ఆ తరవాత 2004 లో వచ్చిన `మాస్ ` చిత్రం తో డైరెక్టర్ గా ఎదిగి సినీ రంగంలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చు కొన్నాడు. అలా తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నాడు. కాగా రాఘవ లారెన్స్ ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ` కాంచన` హిందీ రీమేక్ “లక్ష్మీ బాంబ్ ` కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎపుడు తన చుట్టూ వున్నవారికి సాయం చేయాలనుకొనే గొప్ప మనిషి రాఘవ లారెన్స్ ని అందరూ మనస్పూర్తి గా అభినందిస్తున్నారు .